NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Nimmagadda ramesh kumar – ఈ దెబ్బతో నిమ్మగడ్డ ప్లాన్ అట్టర్ ప్లాప్, స్థానిక సంస్థల ఎన్నికలు క్యాన్సిల్

ఆంధ్రప్రదేశ్ andhra pradesh లో స్థానిక ఎన్నికల పంచాయతీ local body elections హాట్ హాట్ గా తయారైంది. ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ఉద్యోగ సంఘాలు corona కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకూ ఎన్నికలు వద్దంటున్నా ఎన్నికలు జరపకపోతే ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar ఆదరాబాదరాగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామనీ ఆ తీర్పు వచ్చే వరకూ ఆగమని పదేపదే చెప్పినా ఎవరో మెడ మీద కత్తి పెట్టి ఎన్నికలు నిర్వహించమన్నట్లు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లోనూ  నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంత పట్టుదలతో ఉన్నారో అంత కంటే ఎక్కువ పట్టుదలతో ఎన్నికలు నిర్వహించడానికి వీలులేదని ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. “పంచాయతీ ఎన్నిికల ప్రక్రియ ఆపాలి. లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం” అంటూ హెచ్చరికలు జారీ చేశాయి. “అవసరమైతే సమ్మె చేసేందుకు కూడా సిద్ధం, ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యం” అంటూ ఏపి ఎన్ జీఓ ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.

ap employees blantly opposing local body elections

స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కరోనా మహమ్మారితో ఎంతో మంది ఉద్యోగులు, ప్రజలు బలైయ్యారు. ఇప్పుడు కరోనా స్ట్రైయిన్ కేసులు ప్రబలుతున్నాయి అందుకే  వ్యాక్సినేషన్ అనంతరం ఎన్నికలు పెట్టాలని కోరుతున్నామన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి విన్నవించినా ఎస్ఈసీ మొండివైఖరితో ముందుకు వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను వివరిస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించామని, సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుందని ఆయన అన్నారు. ఈ లోపుగానే ఎన్నికల సంఘం హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసిందనీ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎన్నికల  నిర్వహణ అవసరమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

ap employees blantly opposing local body elections

2018లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకూ నిర్వహించలేదు. రెండున్నరేళ్లుగా జరగని ఎన్నికలు మరో రెండు మూడు నెలలు ఆగితే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నాము కానీ హడావుడిగా ఎన్నికలు నిర్వహించి ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు తీసుకురావాలని హైకోర్టు కూడా చెప్పలేదన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికల తరువాత కరోనా కేసులు పెరిగాయని ఆ భయంతోనే ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు చంద్రశేఖరరెడ్డి. సోమవారం నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులను బాయ్ కాట్ చేస్తే ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయి ఎన్నికలు క్యాన్సిల్ అవుతాయేమో చూడాలి మరి. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండి  మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగులు తిరుగాడుతుండగా కరోనా భయం అంటూ కారణం చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రకటనలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju