NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Nimmagadda : నిమ్మగడ్డ – గవర్నర్ భేటీలో కీలక అంశాలు చర్చకు..!?

Nimmagadda : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ లు వేరువేరుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తొలుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ ను కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు వివరించారు. దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్ తో సమావేశమైన నిమ్మగడ్డ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సహకారం అందేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఆదేశించాలని కోరారు. ఇదే సందర్భంగా కొందరు అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యల అంశాన్ని గవర్నర్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరించారు.

Nimmagadda :  ap sec meets governor biswabhusan
Nimmagadda : ap sec meets governor biswabhusan

గవర్నర్ బిశ్వభూషణ్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అదిత్యనాథ్ దాస్ గవర్నర్ ను కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.

Nimmagadda :  ap sec meets governor biswabhusan
Nimmagadda : ap sec meets governor biswabhusan

గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ గా వార్ జరిగిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య అంతరం తగ్గించే ప్రయత్నంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటు ఎస్ఈసీతో అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పరస్పరం సహకరించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చ జరిగింది. అవసరమైతే ఎస్ఈసీ, సీఎస్ తో కలిసి చర్చించాలని గవర్నర్ భావిస్తున్నారు. ఎస్ఈసీతో భేటీలో పంచాయతీరాజ్ అధికారుల అభిశంసన పైనా గవర్నర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా శాంతి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ తదితర ప్రక్రియతో పాటు కరోనా వ్యాక్సినేషన్ కు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ అదిత్యనాధ్ తో గవర్నర్ చర్చించినట్లు సమాచారం.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju