NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Janasena ; పవన్ పంజా విసిరినట్టేనా..!? పంచాయతీ ఎన్నికల్లో మీడియా దాచిన నిజాలు..!!

janasena own media not shown facts

Janasena ; టీడీపీ.. వైసీపీ.. రెండూ క్షేత్రస్థాయిలో వేళ్లూనుకున్న పార్టీలు..! గెలిచిన పార్టీలు. నిరూపించుకున్న పార్టీలు..! అయితే ఈ పార్టీల వాస్తవ బలం, బలగం ఎంత మేరకు అనేది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నది మాత్రం ఈ అనుకూల/ ప్రతికూల మీడియాలే. పార్టీల ఫెయిల్యూర్స్ బయటకు రాకుండా.., కేవలం బలాన్ని ఊహించుకుని పార్టీల భజనలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలే కాదు. జనసేన కూడా ఉంది. ఆ పార్టీకి చరిష్మా, ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నారు. ఆయన వెనుక లక్షలాది అభిమానులు, కార్యకర్తల బలం, బలగం ఉంది. వీరి బలాన్ని చూపించకుండా.. దాచేస్తున్నదీ సో కాల్డ్ మీడియాలే..! మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఆసక్తికర, అనూహ్యమైన ఫలితాలు సాధించింది.

Janasena ; Own - Media Not Shown Facts.
Janasena ; Own – Media Not Shown Facts.

Janasena ; గోదావరి జిల్లాల్లో లేచినట్టే..!?

జనసేనకి పూర్తిస్థాయిలో ఇంకా నిర్మాణం జరగలేదు కానీ.. పూర్తిగా జరిగి ఉంటె గ్రామస్థాయి ఎన్నికల్లో పట్టు వేరేలా ఉండేది. కానీ ఈ మొదటి దశ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఆశించిన ఫలితాలనే సాధించింది. అనూహ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఫలితాలు ఆ పార్టీకి ఊపు తెచ్చింది.

* రాష్ట్రం మొత్తం మీద 3259 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే వైసీపీ 2700 గెలిచినట్టు.. టీడీపీ 550 గెలిచినట్టు.., జనసేన 100 లోపే గెలిచినట్టు ఆయా చానెళ్లు కొన్ని లెక్కలతో సహా చెప్తున్నాయి. కానీ వాస్తవాలు వేరు. ప్రధాన మీడియాలు చూపించని లెక్కలు, లాజిక్కులు క్షేత్రస్థాయిలో జరిగాయి.

janasena own media not shown facts
janasena own media not shown facts

* పశ్చిమ గోదావరి జిల్లాలోనే జనసేన దాదాపు 35 పంచాయతీలను గెలుచుకున్నట్టు తెలుస్తుంది. తూర్పుగోదావరిలో 50 వరకు గ్రామాలు… విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలిపి సుమారుగా 40 గ్రామాలు.. ఇలా రాష్ట్రం మొత్తం మీద 200 నుండి 250 గ్రామాలూ జనసేన మద్దతు పలికిన అభ్యర్థులు గెలిచినట్టు ఇప్పుడిప్పుడే వెల్లడవుతుంది.
* గ్రామస్థాయిలో జనసేన రాజకీయం ఇంకా పూర్తిస్థాయిలో వెళ్ళలేదు. ఆ పార్టీ సిద్ధాంతాలు ఇంకా పూర్తిగా గ్రామస్థాయికి వెళ్ళలేదు. అక్కడ ఇంకా దశాబ్దాల తరబడి నెట్టుకొస్తున్న టీడీపీ.., అధికారంలో ఉన్న వైసీపీ హవాలు మాత్రమే కనిపిస్తున్న వేళలో జనసేన కూడా పంచాయతీ ఎన్నికల్లో ఉనికి చాటడం ఆసక్తికర అంశమే.

Read it ; బీజేపీ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్..!?

Janasena ; Own - Media Not Shown Facts.
Janasena ; Own – Media Not Shown Facts.

బీజేపీ కొన్ని అడ్డుగోడలే..! పవన్ కొంచెం మారితే..!?

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న జనసేనకి బీజేపీ ద్వారా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. నిజానికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమి చేయడం లేదు. రాష్ట్రానికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదు. అందుకే బీజేపీ అంటే రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతుంది. ఆ పార్టీతో కలిసిన జనసేన ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటె ఇక కుదుటపడినట్టే. పవన్ కళ్యాణ్ చరిష్మా.. కార్యకర్తల బలంతో నూటికి 25 , 30 ఓట్లు తెచ్చుకున్నా… బీజేపీ పై ఉన్న వ్యతిరేకత ఫలితంగా 5 , 10 మైనస్ అవుతున్నాయి. అంటే జనసేనకి రావాల్సిన ఓట్లు కూడా బీజేపీ వలన పక్కకి వెళ్లే ప్రమాదాలు లేకపోలేదు.

Janasena ; Own - Media Not Shown Facts.
Janasena ; Own – Media Not Shown Facts.

* అంటే బీజేపీ జనసేనకు పూర్తిగా మైనస్ చేస్తుంది అని కాదు.. కానీ పవన్ కళ్యాణ్ ని, జనసేనని బీజేపీ సరిగ్గా వాడుకోవడం లేదు. జనసేన బలం, బలగం చూసి ఆ పార్టీతో స్నేహం చేసిన బీజేపీ ఇప్పటికే ఈజీగా ఎదగాల్సింది. కానీ.., కేంద్రం చేస్తున్న కొన్ని లోపల, కొన్ని నిర్ణయాల ఫలితంగా అనుకున్న బలం రావడం లేదు. పవన్ కళ్యాణ్ బలాన్ని పూర్తిగా వాడుకుని.., రాష్ట్రానికి నిధులిచ్చి.., అన్యాయం చేయకుండా ఉంటె రాష్ట్రంలో బీజేపీ- జనసేన బలాన్ని మరింత పెంచే పనిలో పవన్ ఉండేవారు. కానీ.. కేంద్రం తీసుకుంటున్న కొన్ని తప్పుడు నిర్ణయాల ఫలితంగా ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సి రావడం జనసేన అభిమానులకు కూడా కష్టంగా మారింది.
* రెండో దశ ఫలితాల్లో కూడా జనసేన ఇదే సంఖ్యలో ఓట్లు సాధించి.. సర్పంచిలని గెలుచుకుంటే… వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీలు అప్రమత్తం అవ్వాల్సిందే. వారి మీడియాలు ఎంత దాచేయాలని చూసినా… జనసేన బలం ఆగే అవకాశమూ ఉండదు..!!

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?