NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Metro Sridharan : మెట్రో శ్రీధరన్ కేరళలో కమలానికి పవర్ తెచ్చిపెట్టేనా?బిజెపి మెగా ప్రయోగం ఫలించేనా?

Metro Sridharan : రాజకీయాల్లో ఒక్కోసారి అనూహ్యాలు అసాధారణ పరిణామాలు అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోతూవుంటాయి. రాజకీయ పార్టీలు, నేతలు ఎప్పుడు ఎవరిని అందలమెక్కిస్తాయో ఊహించలేని పరిస్థితులు కూడా తలెత్తుతుంటాయి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఓ శాస్త్రవేత్త సడన్‌గా భారత రాష్ట్రపతి (అబ్దుల్ కలాం) అయిపోవచ్చు. రాజకీయాల నుంచి తప్పుకుని సన్యాసం తీసుకుని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామనుకుంటున్న సమయంలో క్షణం తీరిక లేని ప్రధాని పదవి కొందరికి (పీవీ నరసింహారావు) దక్క వచ్చు. చాలా లో ప్రొఫైల్‌లో వుండే ఓ వ్యక్తిని తీసుకొచ్చి.. ఏకంగా ఇండియన్ ప్రెసిడెంట్ (రామ్‌నాథ్ కోవింద్) చేయొచ్చు. సరిగ్గా ఇలాంటి పరిణామమే ఇపుడు కేరళలో చోటుచేసుకుంది.

Will Metro Sridharan bring power to bjp in Kerala?
Will Metro Sridharan bring power to bjp in Kerala?

Metro Sridharan : ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి మెట్రో శ్రీధరన్!

అయితే పై ఉదాహరణల కంటే ఇది కాస్త భిన్నం. ఈయనకిపుడు వచ్చిన ఆఫర్ ఆయనకు సీఎం సీటు దక్కే దాకా తీసుకెళుతుందో లేదో ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. ఎస్.. ఆయన మెట్రోమ్యాన్ శ్రీధరన్.దేశంలో మొట్టమొదటి మెట్రో రైలు రూపకర్త. విజయవంతంగా పలు నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం అవడానికి కారకుడు ఈ మెట్రో శ్రీధరన్. ఇప్పడు అందరి కళ్ళు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాపైనే పడ్డాయి. దానికి కారణం ఆయన్ను బీజేపీ తమ సీఎం కేండిడేట్‌గా ప్రకటించడమే. కేరళ బీజేపీ సీఎం అభ్యర్ధిగా శ్రీధరన్‌ను ప్రకటించారు. ఈ మేరకు కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ వెల్లడించారు. మెట్రో శ్రీధరన్ ఇటీవలే తన 88వ ఏట బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమని శ్రీధరన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆయనే తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న ప్రకటన వెలువడింది.

కాంగ్రెస్ ,కమ్యూనిస్టులను దాటి కమలానికి పవర్ వచ్చేనా?

తాజాగా బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను కేరళలో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ఉత్సాహంతో వున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసి.. తన అంకిత భావాన్ని, సాంకేతిక పరిఙ్ఞానాన్ని చాటుకున్న శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా తమ అభిమతం రాజకీయాలు కావని, అభివృద్ధికి బాటలు వేయమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ సర్వీసులో విజయవంతమైన శ్రీధరన్ రాజకీయాల్లో కూడా రాణిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే.. 88 ఏళ్ళ ముదిమి వయసులో ఆయన ముఖ్యమంత్రిగా చురుకుగా వుండగలరా అన్నదిపుడు కేరళ ప్రజల్లో నానుతున్న ప్రశ్న. అయితే.. ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ ఇలా.. ఒకరు కాకపోతే మరొకరు అధికారాన్ని పంచుకునే కేరళలో మూడో పక్షంగా బీజేపీ ఏ మేరకు మెరుగైన ఫలితాలు సాధించగలదో వేచి చూడాలి.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju