Relationship :పడక గదిలో ఆమెను భర్త పొగిడితే చాలా పొంగిపోతుందట. పైకి మాత్రం అవేమి పెద్దగా పట్టించుకోనట్టు ఉంటారట. అయితే చాలామంది భర్తలు Relationship ఆ సమయంలో వారికి సహకరించి ఆనందింప చేసే భార్యలను కనీసం మెచ్చుకోరట. కానీఅలా మెచ్చుకోవడం వలన మీ వైవాహిక జీవితంసుఖం గా ఉంటుందట.
చాలామంది స్త్రీలు పెళ్లయిన తర్వాత తనువెంటనే తల్లి కావాలనిఆశిస్తారట . దానికి సంబంధించి కొన్ని విషయాల్లో కాస్తభయానికిగురవుతారు. గర్భవతి అయ్యాక ఆమె ఎప్పుడూ భర్త భరోసాను ఆశిస్తుంది. ఆ సమయంలో భర్త ఆమెకు ధైర్యం చెబుతూ అండగా నిలవాలి.
click here for Couple: భర్తలు ఇలా చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది!!! (పార్ట్1)
నాకు జీవితంలో నీకన్నా మంచి స్నేహితులు ఎవరు ఉంటారు.. నా కష్టసుఖాలు అన్నీ నీతోనే చెప్పుకోవాలి కదా అనే మాటల ద్వారా మీ భార్య మీ పై మరింత ప్రేమ తో ఉంటారు. దీని ద్వారా శృంగార జీవితం కూడా రసవత్తరం గా ఉంటుందట. నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అనే మాట మహా మంత్రం గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ప్రేమ కోసం మీరు ఈ మాటను మాత్రం కచ్చితంగా ఆమెకు తెలియచేయాలి.స్త్రీలు ఇలా తమను అభినందించే మగవారి పై మరింత ఎక్కువ ప్రేమ ను కలిగి ఉంటారు.
తను మీ జీవితం లో కి వచ్చిన తర్వాత వచ్చిన ప్రమోషన్స్ లేదా ఇతర అదృష్టాలను ఆమెకు చెప్పి థాంక్స్ చెబితే తన గుండెలో ఇక మీ స్థానాన్ని ఎవరూ దక్కించుకోలేరు.ప్రతి భార్య తన భర్త గురించి అన్ని విషయాలు తెలుసు అనుకుంటుంది. అందువల్ల మీ మనస్సులో ఏమనుకుంటున్నారో ఆమె ముందుగానేకనిపెట్టి చెప్పేస్తుంది. ఆ గుణాన్ని ఖచ్చితం గా మీరు అభినందించాలి. మీకిష్టమైన వంటకం వండినప్పుడు, మీకు నచ్చిన దానిని గిఫ్ట్‌గా ఇచ్చినప్పడు ఆమెను మీరు ఖచ్చితం గా మెచ్చుకుని తీరవలిసిందే..