NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan ; ఆ సర్వేతో వైసీపీలో కాస్త ఆందోళన..! అందుకే 14 న తిరుపతికి సీఎం జగన్..!!

YS Jagan ; Serious decision about tirupathi by election

YS Jagan ; తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రోజు రోజుకి రాజకీయ ఉత్కంఠని పెంచుతుంది.. వైసీపీకి ఈజీ అనుకున్న చోట ఇప్పుడు వైసీపీకి చెమటలు పట్టే పరిస్థితి వచ్చింది. ప్రచారంలో టీడీపీ దూసుకెళ్తుండడం.. బీజేపీ కూడా వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్రని బాగా తీసుకెళ్తుండడంతో.. ఇక తప్పని పరిస్థితిలో వైసీపీ అప్రమత్తమైంది. సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 14 న ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొదట అనుకున్న ప్రకారం అయితే జగన్ వెళ్లకుండా మేనేజ్ చేయాలి అనుకున్నారు.., కానీ పరిస్థితులు మారుతున్నాయి. వెళ్ళక తప్పట్లేదు..!

Read It ; తిరుపతిలో టీడీపీ ఏం చేస్తుంది..!? ఫలితం ఎలా ఉండొచ్చు..!?

YS Jagan ; Serias decision about tirupathi by election
YS Jagan ; Serias decision about tirupathi by election

YS Jagan ; నాలుగు నియోజకవర్గాల్లో ఓటర్ మీటర్ తిరుగుతుంది..!?

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలతో పాటూ వివిధ సర్వే బృందాలు, ఇంటెలిజెన్స్ బృందాలు తిష్ట వేసాయి. రెండు రోజులకోసారి సర్వే నివేదికలు రూపొందించి పార్టీ పెద్దలకు అందిస్తున్నాయి. టీడీపీకి రాబిన్ శర్మ టీమ్ నుండి ఒకటి, టీడీపీ సొంత ఇంటెలిజెన్స్ నుండి ఒకటి.. ఇలా రెండు రకాల నివేదికలు అందుతుండగా… వైసీపీకి అధికారిక సీఎం సొంత ఇంటెలిజెన్స్, పార్టీ సర్వే టీమ్, పీకే బృందం ద్వారా మూడు రకాల నివేదికలు అంటున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. వైసీపీకి గాలి తగ్గుతుంది. టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుండడం ఆ పార్టీకి కలిసొస్తున్న విషయం వెల్లడయింది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో పరిస్థితులు మారుతున్నట్టు గుర్తించారు. వైసీపీ అత్యంత బలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో రోజు రోజుకీ వైసీపీ బలం తగ్గుతుందని తేలడంతో సీఎం జగన్ రోజులో గంట పాటూ ఈ ఎన్నిక, ప్రచార తీరుపై గడపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గూడూరులో ఎమ్మెల్యే వర్గం పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుందేమో అనే అనుమానాలు.. తిరుపతిలో హిందూ వ్యతిరేక ముద్ర బలంగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుండడం.., మరోవైపు టీడీపీ అన్ని రకాలుగా ముందుండడంతో జగన్ సీరియస్ గా ఈ ఎన్నికపై దృష్టి పెట్టినట్టు సమాచారం.

Must Read ; జనసేన – బీజేపీ ఇప్పుడు భజన..!? ఫలితం తేడా కొడితేనో..!? 

YS Jagan ; Serious decision about tirupathi by election
YS Jagan ; Serious decision about tirupathi by election

14 న తిరుపతిలో బహిరంగ సభ, రోడ్ షో..!?

తను హిందూ వాదిని.., బీజేపీ దుష్ప్రచారం చేస్తుంది. తిరుపతి ప్రతిష్టని వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాపాడుతుంది.. వైసీపీ హిందూ వ్యతిరేకి కాదు.. ఈ రకమైన ప్రచారాన్ని శ్రేణుల్లోకి.. తద్వారా ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సర్వే బృందాలు గుర్తించాయి. అందుకే
తిరుపతిలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 14 తిరుపతి నగరంలో మూడు గంటల పాటూ రోడ్ షో నిర్వహించి.., ఓ చోట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. జగన్ కూడా ఈ మేరకు అధికారులకు, పార్టీ పెద్దలకు కీలక సూచనలు చేశారు. గమ్మత్తేమిటంటే.. అదే రోజున టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తిరుపతి నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈసీకి, పోలీసులకు సమాచారం ఇచ్చి, అనుమతులు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ సీఎం జగన్ కూడా అదే రోజున వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో..!? మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. సీఎం అయ్యాక జగన్ పాల్గొననున్న తొలి పొలిటికల్ మీటింగ్ ఇదే కానుంది..!!

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella