NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Covid-19 : భారత్ లో కరోనా కల్లోలం..! వారంలో 70 శాతం పెరిగిన కొత్త కేసులు..!!

corona cases increasing in india

Covid-19 : కోవిడ్-19 Covid-19 గతేడాది భారత్ ను బంధించి వదిలేస్తే.. ఈ ఏడాది కమ్మేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. గతేడాది వ్యవస్థలు కూప్పకూలాయి. ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. ప్రజలు ఉపాధి, ఆర్ధిక పరిస్థితి మీద దెబ్బ కొట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగానే వెళ్తోంది. అయితే.. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం కాస్త ఉపశమనం ఇచ్చే విషయం. అయినా.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు అభయం ఇవ్వడం కంటే.. భయాన్నే ఇస్తున్నాయి. గత వారంలో రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం.

corona cases increasing in india
corona cases increasing in india

గత వారంతో పోలిస్తే గతవారం కొత్తగా నమోదైన కరోనా కేసుల శాతం 70 శాతం అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ 5 నుంచి 11 (వారంలో రోజుల్లో) దేశంలో 9,38,650 కొత్త కేసులు నమోదవడం తీవ్రంగా కలవరపెట్టే విషయం. ఏప్రిల్ 5కి దేశంలో 7లక్షల కేసులు ఉంటే.. వారంలో నాలుగున్నర లక్షలు పెరిగిపోయాయి. దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రాల్లో మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే అక్కడ 62వేల కేసులు నమోదయ్యాయి. తర్వాత.. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గడ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఉన్నాయి. మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. 24 గంటల్లో 903 మంది మృతి చెందారు. వారం క్రితంతో పోలిస్తే ఇది 70 శాతం పెరుగుదల. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక రోజువారీ మరణాల రేటు.

కరోనా కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రెజిల్ ను దాటి రెండో స్థానంలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 6.32 లక్షల కరోనా కేసులు నమోదైతే భారత్ లో 1,68,912 గా ఉంది. మొత్తంగా అమెరికాలో 3.19 కోట్ల మందికి కరోనా సోకితే.. రెండో స్థానంలో ఉన్న భారత్ లో 1.35 కోట్ల మంది.. బ్రెజిల్ లో 1.34 కోట్ల మందికి వైరస్ సోకింది. భారత్ రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చిన దేశంగా గర్వించాలో.. రెండో స్థానంలో నిలిచినందుకు బాధ పడాలో అర్ధంకాని పరిస్థితి ఇది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju