F 3 : ఎఫ్ 3..సూపర్ హిట్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ లో వెంకటేష్ కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్ కి జంటగా మెహ్రీన్ నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 27న ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే శరవేగంగా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఎఫ్ 3 షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. కాగా తమన్నా, మెహ్రీన్ తో పాటు మరో హీరోయిన్ కూడా త్వరలో ఎఫ్ 3 షూటింగ్ లో జాయిన్ కాబోతోందని తాజా సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన అంజలి అని తెలుస్తోంది. గత కొంతకాలంగా అంజలి టాలీవుడ్లో మంచి హిట్ అందుకోవాలని ట్రై చేస్తోంది.
F 3 : ఆ ప్లేస్ లో అంజలిని ఎంపిక చేసుకున్నారట.
కానీ అంజలికి అనుకున్న హిట్ దక్కడం లేదు. అదృష్టం కొద్దీ పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ లో అంజలి కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల నుంచి అలాగే ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఎఫ్ 3 లో మూడవ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ముందు ఈ క్యారెక్టర్ కోసం సోనాల్ చౌహాన్ ని తీసుకోవాలనుకున్నారట చిత్ర బృందం. అయితే కరోనా కారణంగా సోనాల్ హైదరాబాద్ కి తీసుకు రావడం కష్టమని ఆ ప్లేస్ లో అంజలిని ఎంపిక చేసుకున్నారట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.