IPL 2021: ఈ ఐపీఎల్ ఫేవరెట్ జట్ల రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్! వారి ధైర్యం అతనే

Share

IPL 2021:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా జట్టు కి ఒక విశేషమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి చెందిన ఈ జట్టు గంభీర్ కెప్టెన్సీలో రెండుసార్లు టైటిల్ సాధించింది. అయితే అప్పటి నుండి వీరి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. భీకర హిట్టర్లు, ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నప్పటికీ ఆ తర్వాత నుండి సరైన సారథి లేక కోల్‌కతా జట్టు వరుసగా ఐపీఎల్ లో తడబడుతూ వచ్చింది.

 

IPL 2021 kolkata knight riders in speed race
IPL 2021 kolkata knight riders in speed race

అయితే ఈసారి ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పగ్గాలు అందుకోవడంతో ఒక్కసారిగా ఫేవరెట్స్ రేస్ లోకి వచ్చేసింది. మోర్గాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జాతీయ జట్టు వన్డే ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. అలాగే మోర్గాన్ భీకరమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అంతే కాకుండా అత్యద్భుతమైన ఫినిషర్ కూడా. టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టుకు అతను ఆ స్థానంలో ఎప్పటినుండో విశేష సేవలు అందిస్తున్నాడు. పైగా ఆట పై అవగాహన,కెప్టెన్సీ విషయంలో చూపించాల్సిన నిబద్ధత అతనికి మెండుగా ఉన్నాయి.

ఎటువంటి పరిస్థితుల్లో అయినా మోర్గాన్ మొహం పైన చిరునవ్వు చెక్కు చెదరదు. తోటి ఆటగాళ్ళని నమ్ముతూ, ధైర్యం చెబుతూ వారిలో ఆత్మ స్థైర్యం నింపుతుంటాడు. గత సీజన్ లో దినేష్ కార్తీక్ మోర్గాన్ కి మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ విశేషమైన ప్రతిభ కనబరిచి వరకు ప్లే ఆఫ్స్ అంచుల వరకు వెళ్ళింది.

ఈసారి మొదటి మ్యాచ్లోనే పటిష్ట సన్ రైజర్స్ జట్టు పై విజయం సాధించింది ఐపీఎల్ లో పెద్దగా బలహీనతలు లేని అతికొద్ది జట్లలో ఒకటిగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఈ రోజు ముంబై తో మ్యాచ్ లో కూడా వాళ్ళే ఫేవరెట్స్ అని చెప్పవచ్చు.


Share

Related posts

ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన రోజే ఏపీ ప్ర‌జ‌ల‌ను బాధ పెట్టిన జ‌గ‌న్ ?

sridhar

Shiva Movie : శివ ‘ సినిమా సీన్ గుర్తుకు తెస్తున్న అడ్వకేట్ దంపతుల హత్యోదంతం!నాలుగు నెలలుగా వేటాడి వెంటాడి హతమార్చిన వైనం!

Yandamuri

వాస్తు బాగోలేదని.. ఫ్రీ ఫ్లాట్ వదిలేశారు

Kamesh