NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID RRR Case: రఘురామా ఏమిటీ లీల …! ఏ కాలికి సామీ దెబ్బతగిలింది..?

AP CID RRR Case: రాజద్రోహం కేసులో ఏపి సీఐడి అధికారులు అరెస్టు చేసిన వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇటు రాష్ట్రంలోనే దేశ వ్యాప్తంగా సంచలన వార్త అయిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీ విచారణలో ఉన్న సమయంలో తన పాదాలపై కొట్టారంటూ రఘురామ కృష్ణం రాజు ఆరోపణ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే గుంటూరు జీజీహెచ్ వైద్యులు కొట్టినట్లుగా గాయాలు ఏమీ లేవనీ, పాదం రంగు మారి, కొద్ది వాపు ఉన్నట్లుగా పేర్కొన్నారు. జీజీహెచ్ వైద్యుల నివేదికపై రఘురామ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

AP CID RRR Case supreme court
AP CID RRR Case supreme court

రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించిన గుంటూరు జీజీహెచ్ సూపర్నిటెండెంట్ భర్త వైసీపీ లో క్రియాశీల నాయకుడని, అధికార పార్టీ ప్రభావం ఉంటుందంటూ ఆ మెడికల్ రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. సీఐడీ కోర్టు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రమేష్ ఆసుపత్రిలోనూ పరీక్షలు నిర్వహించి నివేదక ఇవ్వాలని ఆదేశిస్తే పోలీసులు మాత్రం కేవలం జీజీహెచ్ లోనే పరీక్షలు చేయించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని సుప్రీం కోర్టుకు న్యాయవాదులు  విన్నవించిన దరిమిళా వైద్య  పరీక్షల నిర్వహణను ఆర్మీ ఆసుపత్రిలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో నిర్వహించాలని, తెలంగాణ హైకోర్టు న్యాయాధికారి సమక్షంలో మొత్తం వీడియో గ్రఫీ తీసి నివేదిక పంపాలని ఆదేశించిన జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేసి పంపిన నివేదకను సుప్రీం కోర్టు పరిశీలించింది. పాదానికి గాయాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఎడమ కాలి బొటన వేలి సమీపంలో చిన్న ఫ్రాక్చర్ కూడా అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేదిక పరిశీంచిన సుప్రీం కోర్టు ఇరువర్గాల వాదనలు విని చివరకు షరతులతో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎడమ కాలికి గాయం అయ్యిందని ఆర్మీ వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు.

AP CID RRR Case supreme court
AP CID RRR Case supreme court

అయితే గుంటూరు నుండి కారులో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురామ కృష్ణం రాజు కారులో నుండి మీడియా కెమెరాలు కనబడిన సందర్భంలో తన కుడి కాలు పైకి ఎత్తి చూపించారు. కారు ఎడమ సీటులో కూర్చున్న రఘురామ ఎడమ కాలు పైకి ఎచ్చి చూపించడం కష్టం కావడంతో తన అనుకూల మీడియాలో హైప్ క్రియేట్ చేయడం ఏదో ఒక కాలు చూపించాలన్నట్లు కుడి కాలు చూపించారా? లేక ఏ కాలుకు దెబ్బ తగిలిందో తెలియక కంగారులో అలా చేశారా ? అని చర్చించు కుంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఆర్మీ వైద్యుల రిపోర్టుతో రఘురామ చేసిన ఆరోపణలో కొంత నిజం ఉందని తేలిపోయింది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri