NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: క‌రోనా టెన్ష‌న్‌లో కేసీఆర్ కు మ‌ళ్లీ అదే షాక్ త‌గిలింది…

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు క‌రోనా టైంలో హైకోర్టు కేంద్రంగా వ‌స్తున్న ప్ర‌శ్న‌ల వ‌ర్షం మ‌ళ్లీ ఎదురైంది. కరోనా థర్డ్ వేవ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు సరిగ్గా లేకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుని కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా అమలు చేయడంలేదని, ఇక థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించింది. అయితే, ప్ర‌భుత్వం మాత్రం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది.

Read More : Corona: షాక్ఃక‌రోనా టీకా ప‌నిచేయ‌డం లేద‌ని కేసు పెట్టాడు

హైకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం…

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజారోగ్య డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా అందించిన నివేదికలను హైకోర్టు పరిశీలించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసింది. ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పూర్తి వివరాలు లేవని పేర్కొంది. కరోనా కట్టడి కోసం, ప్రజలకు ఎదురయ్యే కష్టాల పరిష్కారం కోసం, ఇబ్బందులను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పినా ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు కూడా లేవని గుర్తుచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో టెస్టుల సంఖ్యను పెంచడం కీలకమని, కొత్తగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేసే లాబ్‌‌లను నెలకొల్పాలని సూచించినా ఇంకా అందుబాటులోకి ఎందుకు రాలేదని ప్రశ్నించింది.

Read More : Corona: క‌రోనా విష‌యంలో కేంద్రం ముచ్చ‌ట న‌మ్మేలా లేదు… ఓవైసీ సంచ‌ల‌నం…

ప్రైవేట్ ఆస్ప‌త్రుల విష‌యంలో క‌న్నెర్ర‌….

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం గరిష్టంగా ఎంత ఛార్జి చేయవచ్చునో ప్రభుత్వం కొత్తగా జీవోను జారీ చేయాలని హైకోర్టు గత విచారణ సందర్భంగా సూచించినా ఇప్పటికీ అలాంటి ఉత్తర్వులు ఎందుకు వెలువరించలేదని ప్రశ్నించింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకే తరహా చికిత్స ఛార్జీలు ఉండాలని చెప్పినా అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారని, ఆస్తులు అమ్ముకుంటున్నారని, ఇంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ, ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులను జారీ చేశామని అందులో పది ఆసుపత్రులకు కరోనా చికిత్స కోసం ఇచ్చిన అనుమతులను రద్దుచేసినట్లు తెలిపారు. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలను పెంచుతున్నట్లు తెలిపారు.

Related posts

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?