Akhil: అక్కినేని అఖిల్ హిట్ కోసం తెగ తాపత్రయ పడుతున్న సంగతి తెలిసిందే. హీరో పరంగా గ్లామర్ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు డాన్స్, ఫైట్స్ వంటి మల్టీ టాలెంట్లు ఉన్నా గాని .. హిట్ మాత్రం పడటం లేదు. దీంతో అఖిల్ కి అన్నీ ఉన్నా గాని అదృష్టం లేకుండాపోయింది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం అఖిల్ హిట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో “ఏజెంట్” అనే సినిమా ఒప్పుకోవటం తెలిసిందే.
ఈ సినిమాలో గత చిత్రాలకు భిన్నంగా అఖిల్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు సినిమా పోస్టర్ బట్టి తెలుస్తోంది. కరెక్ట్ గా అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ రీతిలో సురేందర్ రెడ్డి సినిమా చేస్తున్నట్లు అక్కినేని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ కి “అర్జున్ రెడ్డి” సినిమా ఏ రీతిలో విజయం ఇచ్చిందో ఆ రీతిలో ఈ సినిమా అఖిల్ కి “ఏజెంట్” సినిమా విజయం ఇచ్చే విధంగా ఉందని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.
Read More: Akhil : అఖిల్ సినిమా మళ్ళీ వాయిదా..?
ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర లో ఓ సరికొత్త నటుడు తీసుకురావడానికి సురేందర్ రెడ్డి డిసైడ్ అయినట్లు ఫిలిం వర్గాలలో టాక్. మేటర్ లోకి వెళ్తే సినిమా అఖిల్ కి ప్రతినాయకుడి పాత్రలో ఉపేంద్ర నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించినట్లు ఆయన ఓకే అన్నట్లు టాక్. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. త్వరలో షూటింగ్ మొదలు కానున్న తరుణంలో .. ఉపేంద్ర క్యారెక్టర్ కి సంబంధించి కన్ఫామ్ న్యూస్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.