Vijay Deverakonda: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినీ కెరీర్లో “మగధీర” ఇండస్ట్రీ హిట్ అయినా కానీ యాక్టింగ్ పరంగా “రంగస్థలం” సినిమా ని మించినది లేదు అని చాలామంది చెబుతారు. అంతలా సినిమాలో చెర్రీ పాత్రని డిజైన్ చేశారు డైరెక్టర్ సుకుమార్. గ్రామీణ నేపథ్యంలో.. రాజకీయాలను బేస్ చేసుకుని.. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం.. చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ తో సినిమా స్క్రిప్ట్ డైరెక్టర్ సుకుమార్ సెట్ చేసినట్లు ఫిలిం వర్గాల టాక్.
మేటర్ లోకి వెళ్తే తెలంగాణ వాతావరణాన్ని ప్రతిబింబించే రీతిలో… విజయ్ దేవరకొండ సినిమా స్టోరీ సెట్ చేయడానికి సుకుమార్ తన తెలివితేటలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఒక పోరాట పటిమ తరహాలో.. అమాయకత్వం గా ఉండే కుర్రోడు తిరగబడితే ఏ విధంగా ఉంటుంది.. అనే రీతిలో కథని డైరెక్టర్ సుకుమార్ సిద్ధం చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం సుకుమార్ “పుష్ప” సినిమా చేస్తున్నారు. మనీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు ఏడాదికి పైగా నే షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా రెండు భాగాలుగా వస్తున్న నేపథ్యంలో మరి కొంత టైం పట్టే అవకాశం ఉండటంతో… ప్రస్తుతం షూటింగ్ కి అవకాశం లేకపోవడంతో విజయ్ దేవరకొండ సినిమా స్టోరీ పై సుకుమార్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం తన కెరీర్లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. “లైగర్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. దీని కంప్లీట్ చేసుకున్న తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేది ప్రస్తుతం.. ఇండస్ట్రీలో ఇదొక విచిత్రమైన కాంబినేషన్.. అనే టాక్ వినపడుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!