NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Power Bills: విద్యుత్ శాఖ లీలకు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావుగా..! ఇది తాజా ఉదాహరణ..!!

Power Bills: విద్యుత్ శాఖ అధికారుల లీలలు సామాన్య ప్రజానీకానికి ఓ పట్టాన అర్థం కావు. పూరి గుడిశకు వేలాది రూపాయలు బిల్లు చేతిలో పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. సహజంగా కరెంటు వాడకానికి సంబంధించి మీటర్ రీడింగ్ ఆధారంగా లెక్క వేసి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కరెంటు వాడుకోకపోతే మినిమమ్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సున్నా రీడింగ్ ఉన్న విద్యుత్ సర్వీసుకు ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా బిల్లు రావడంతో ఆ వినియోగదాడు ఖంగు తిన్నాడు. ఇది కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది.

wrong Power Bills
wrong Power Bills

మచిలీపట్నం పరాసుపేటలోని సర్వీస్ నెంబర్ 62222405066396 వినియోగదారుడు అసలు విద్యుత్ వాడలేదు. బిల్లు మీద జీరో యూనిట్ లే ఉంది. కానీ బిల్లు మాత్రం రూ.1027 లు జనరేట్ అయ్యింది. ఇదే వినియోగదారుడికి గతంలో కూడా ఆరు నెలల నుండి అసలు విద్యుత్ వాడకపోయినా నెలకు రూ.300లు చొప్పున చెల్లించాడు. అయితే ఇప్పుడు ఏకంగా రూ.1027లు బిల్లు రావడంతో ఆ వినియోగదారులు అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తన బిల్లు సరిచేయాల్సిందిగా కోరుతున్నాడు.

Read More: KCR Politics: పక్క సీఎంపైనే నిఘా పెట్టినోడు.. సొంత మంత్రులపై ఓ లెక్కా..!? ఇదో ఇంట్రె”స్టింగు” కేసీఆర్ కథ..!!

విద్యుత్ మీటర్ రీడింగ్ వాస్తవానికి ప్రతి నెలా 30 రోజులకు ఒక సారి తీయాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో మీటర్ రీడింగ్ తీసే వారు రెండు మూడు రోజులు ఆలస్యంగా రీడింగ్ తీయడం వల్ల కూడా వినియోగదారులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక నెలలో ఒక యూనిట్ ఎక్కువగా వచ్చినా వందల్లో బిల్లు తేడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. 0 నుండి 50 యూనిట్ లకు ఒక ధర, 51 నుండి 100 యూనిట్ లకు ఒక ధర, 100 నుండి 200ల యూనిట్ లకు మరో ధర ఇలా చార్జీలు వసూలు చేయడంతో స్లాబ్ సిస్టమ్ లో ఒక్క యూనిట్ పెరిగినా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంది. రీడింగ్ తీయడంలో జాప్యం వల్ల నష్టపోతున్నామని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మీటర్ రీడింగ్ లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తప్పుడు బిల్లులు రాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju