Coffee: చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగడం వలన అల్జీమర్ వ్యాధి అడ్డుకోవచ్చని దక్షిణ ఫ్లోరిడా యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో బయట పడింది.కాఫీలో ఉండే కఫేన్లు శరీరంలోని రక్తపు స్థాయి పెరిగేలా చేస్తుంది అని ఆ అధ్యయనం తెలిపింది. కాఫీ గింజల్లో ఉండే కఫేన్ వలన జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని తేల్చింది. సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి కఫెనేటెడ్ కాఫీ పెంచుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు. అలాగే కాఫీ తాగితే ఉత్సాహం, చురుకుదనం తో పాటు గుండెకు కూడా మంచిది. కెఫిన్ గుండెకు రక్షణ ఇస్తుంది. క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల గుండె సక్రమం గా పనిచేస్తుంది అని సర్వే లో కూడా తేలింది.
రోజుకు రెండు లేదా మూడు కప్పుల వరకు కాఫీ తాగితే పక్షవాతం వంటి వ్యాధులు కూడా రావట. అదే సమయంలో అధికంగా తాగితే మాత్రం బీపీ వంటి రోగాలు కొని తెచ్చుకున్నట్టే నని తెలియచేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో కోల్డ్ కాఫీ తాగేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. వేడి వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ తాగడం మంచిది అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది అంత మంచిది కాదని డాక్టర్ లు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఆఫీస్ లో పనిచేసేవారు కోల్డ్ కాఫీ తాగితే అలసట ఉండదు అని భావిస్తుంటారు. అయితే కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనంలో అది తప్పని తెలిసింది. కోల్డ్ కాఫీ తాగడం కంటే , వేడి వేడి కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది అని పరిశోధకులు తెలియజేశారు.
కోల్డ్ కాఫీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటే వేడి కాఫీ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయి. కనుక వీలైనంత వరకు కోల్డ్ కాఫీ తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే జీర్ణాశయ సమస్యల తో పాటు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.