NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Paris: ఈ సొరంగ మ్యూజియం చూడడానికి గట్స్ కావాలి.. సందర్శించడానికి మీరు సిద్ధమా..!!

Paris: ప్యారీస్ అందాలను చూడటానికి పర్యాటకులు వెళ్తుంటారు.. ఇప్పటికీ పలు సినిమాలలో ప్యారిస్ మెరుపులు చూపించారు.. అయితే ప్యారిస్ లో ఉన్న కంకాళాల మ్యూజియం వీటికి భిన్నంగా ఉంటుంది.. ఈ మ్యూజియం మొత్తం నడవడానికి 45 నిమిషాలు పడుతుంది.. ఈ మ్యూజియం లోకి వెళ్లిన వారికి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. ఇంతకీ ఈ మ్యూజియం వణుకు పుట్టించడానికి వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Paris: kamkashala Musium is the empire of death
Paris: kamkashala Musium is the empire of death

Read More: Puri Musings: ఒక్కటే జీవితం.. ఒక్కసారే బ్రతుకుతాం.. ఒక్క మెతుకు కూడా వదలద్దు..

ఈ అందమైన నగరం అడుగు భాగంలో వణుకుపుట్టించే ఒక వింత ఉంది.. ఈ అందాల నగరం కింద కుప్పలుతెప్పలుగా ఉన్నది మానవ కంకాళాలు.. సుమారు 70 లక్షల మందికి పైగా మానవ అవశేషాలు ప్యారిస్ నగరం కింద ఉన్నాయి.. ఇవి 18వ శతాబ్దంలోనే కళేబరాలతో నిండి ఉన్నాయి. వీటిని ప్యారిస్ కాటకోంబ్స్ అని పిలుస్తారు.. ప్యారిస్ నగరం అభివృద్ధి చెందుతుండటంతో స్మశానాలు స్థలం తగ్గిపోయింది.. దీంతో నగరంలోని అతిపెద్ద స్మశానవాటిక లెస్ ఇన్నోసెంట్స్ లో మృతదేహాలు బాగా ఎక్కువైపోయాయి. దీంతో స్మశాన వాటిక నుంచి దుర్వాసన వస్తుందంటూ చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదులు చేశారు. అప్పటి ప్యారిస్ రాజులు నగరంలో ఎవరు అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించిన అక్కడ చర్చి అందుకు ఒప్పుకోలేదు. యధావిధంగా అంత్యక్రియలు నిర్వహిస్తూనే ఉన్నారు. స్మశానం నుంచి ఎంత భయంకరమైన దుర్వాసన వస్తుంది అంటే సువాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్లు అమ్ముకునే వాడు కూడా వారి వ్యాపారం చేసుకునంత వచ్చింది అయినప్పటికీ ఆ స్మశానవాటికలో అంత్యక్రియలు యధాతధంగా జరుగుతాన్నాయి. 1780 లో ప్యారిస్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో లెస్ ఇన్నోసెంట్స్ ప్రహరీ గోడ అ కూలిపోయింది. కుళ్లిపోయిన సవాలు నగరంలో రోడ్లపైకి కొట్టుకు వచ్చాయి. దీంతో మరోచోటకు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పటి రాజు నగర నిర్మాణం కోసం సున్నపురాయి తీసుకురావడానికి సొరంగాలను తవ్వారు. అవి కూలిపోయేలా ఉండడంతో వాటికి మరమ్మతులు చేయించిన రాజు స్మశానాలలోను మృతదేహాలను సొరంగాల్లోకి మార్పించారు. దీనికోసం ప్రతిరోజు రాత్రిపూట సమాధులను తవ్వి మృతదేహాలను ఈ సొరంగంలోకి పంపించేవారు. వీటి వద్ద ఒక మతపెద్ద ఉండి ప్రార్థనలు చేసేవారు. ఇలా 12 ఏళ్లు కష్టపడి ప్యారిస్ లోని స్మశానాలు అన్నింటిని ఖాళీ చేయించారు. ఇందులో అతి పురాతనమైన 1200 నాటివని అంచనా వేస్తున్నారు. అప్పట్లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం లో మరణించిన వారిని కూడా ఇందులోనే సమాధి చేశారు. 1860 లో ఈ సొరంగంలోకి మృతదేహాలను తరలించడం ఆపేశారు.

 

నెపోలియన్ ఆ తర్వాత ఫ్రాన్స్ ను పాలించారు. చాలా మంది పని వాళ్ళు సొరంగంలోకి వెళ్లి కుప్పలు తెప్పలుగా ఉన్న ఎముకలను రకరకాల ఆకృతులలో మార్చారు. ఈ సొరంగాలను టూరిస్ట్ స్పాట్ గా మార్చారు నెపోలియన్. ఇప్పుడు ఈ కాటకోంబ్స్ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రంగాల్లో కేవలం ఒక మైలు మాత్రమే చూడడానికి వీలు కల్పించారు. ఈ సొరంగం ఎంట్రీ డోర్ మీద ఆగండి! ఇది మరణ సామ్రాజ్యం”(Stop! This is The Empire Of Death!) అని రాసి ఉంటుంది.. ఈ కంకాళాల మ్యూజియం నడవడానికి 45 నిమిషాలు పడుతుంది దీనిని సందర్శించిన టూరిస్టులకు ముచ్చెమటలు పడతాయి.. ఈ మ్యూజియం మొత్తం చుట్టు వచ్చేలోపు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అంటున్నారు.. అయితే అయితే ఈ మ్యూజియం సందర్శన మాత్రం సూపర్ థ్రిల్ ను అందిస్తుందని సందర్శించిన పర్యాటకులు అంటున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju