NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss 5 : బిగ్ బాస్ 5 హోస్ట్‌గా ఈసారి రానా..!

Bigg boss 5 : బిగ్ బాస్..దేశ వ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హిందీలో మొదలైన ఈ బిగ్ రియాలిటీ షో ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలలోకి వచ్చింది. బాలీవుడ్ లో 14వ సీజన్ కాగా, తెలుగు, తమిళ భాషలలో 5వ సీజన్ త్వరలో ప్రసారం కాబోతోంది. హౌజ్ లో జరిగేది మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే అని తెలిసినా జనాలకి మాత్రం ఇదొక క్రేజీ షోగా మారింది. తెలుగులో మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్.టి.ఆర్ వ్యవహరించాడు. బుల్లితెర మీద కనిపించింది మొదటిసారైనా అద్భుతమైన స్టాండర్డ్స్ తో అలరించాడు. షోకి మంచి రేటింగ్ వచ్చింది.

is rana going to host in bigg-boss-5....?
is rana going to host in bigg-boss-5….?

ఆ తర్వాత సీజన్ 2కి నేచురల్ స్టార్ ని తీసుకున్నారు నిర్వాహకులు. అయితే కాస్త డల్ గా సాగింది. నాని సినిమాలలోనే నేచురల్ పర్ఫార్‌మెన్స్ తో అదరగొట్టగలదు గానీ, ఇలాంటి షోస్ కి కష్టమే అని చెప్పుకున్నారు. దాంతో సీజన్ 3, 4లకు టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. రెండు సీజన్స్ సూపర్ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా సాగాయి. ఇక ఎప్పటిలాగే సెప్టెంబర్ నుంచి సీజన్ 5 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్నా, మొన్నటి వరకు నాగార్జుననే బిగ్ బాస్ 5 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. దాదాపు అందరూ ఫిక్సయ్యారు కూడా.

Bigg boss 5 : రానా బిగ్ బాస్ 5కి హోస్ట్ గా ఫైనల్ అయ్యాడట.

కానీ తాజాగా రానా దగ్గుబాటి పేరు వినిపిస్తోంది. ఈసారి రానా బిగ్ బాస్ 5కి హోస్ట్ గా ఫైనల్ అయ్యాడట. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. రానా దగ్గుబాటి ఇప్పటికే నంబర్ వన్ యారి కి హోస్ట్ గా వ్యవహిస్తున్నాడు. ఈ సీజన్ ని రానా చక్కగా నడిపిస్తున్నాడు. దాంతో బిగ్ బాస్ 5 రానా చేతికి వచ్చిందట. ఇక ఈసారి రెండు రియాలిటీ షోలు ఒకేసారి ప్రసారం అయ్యే అవకాశం ఉందని సమాచారం. జూనియర్ ఎన్.టి.ఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఛానల్ నిర్వాహకులు అఫీషియల్‌గా ప్రకటించి ప్రోమో కూడా వదిలారు. ఈపాటికే మొదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ ప్లాన్ చేస్తున్నారట.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri