Bigg boss 5 : బిగ్ బాస్..దేశ వ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హిందీలో మొదలైన ఈ బిగ్ రియాలిటీ షో ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలలోకి వచ్చింది. బాలీవుడ్ లో 14వ సీజన్ కాగా, తెలుగు, తమిళ భాషలలో 5వ సీజన్ త్వరలో ప్రసారం కాబోతోంది. హౌజ్ లో జరిగేది మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే అని తెలిసినా జనాలకి మాత్రం ఇదొక క్రేజీ షోగా మారింది. తెలుగులో మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్.టి.ఆర్ వ్యవహరించాడు. బుల్లితెర మీద కనిపించింది మొదటిసారైనా అద్భుతమైన స్టాండర్డ్స్ తో అలరించాడు. షోకి మంచి రేటింగ్ వచ్చింది.
ఆ తర్వాత సీజన్ 2కి నేచురల్ స్టార్ ని తీసుకున్నారు నిర్వాహకులు. అయితే కాస్త డల్ గా సాగింది. నాని సినిమాలలోనే నేచురల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టగలదు గానీ, ఇలాంటి షోస్ కి కష్టమే అని చెప్పుకున్నారు. దాంతో సీజన్ 3, 4లకు టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. రెండు సీజన్స్ సూపర్ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా సాగాయి. ఇక ఎప్పటిలాగే సెప్టెంబర్ నుంచి సీజన్ 5 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్నా, మొన్నటి వరకు నాగార్జుననే బిగ్ బాస్ 5 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. దాదాపు అందరూ ఫిక్సయ్యారు కూడా.
Bigg boss 5 : రానా బిగ్ బాస్ 5కి హోస్ట్ గా ఫైనల్ అయ్యాడట.
కానీ తాజాగా రానా దగ్గుబాటి పేరు వినిపిస్తోంది. ఈసారి రానా బిగ్ బాస్ 5కి హోస్ట్ గా ఫైనల్ అయ్యాడట. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. రానా దగ్గుబాటి ఇప్పటికే నంబర్ వన్ యారి కి హోస్ట్ గా వ్యవహిస్తున్నాడు. ఈ సీజన్ ని రానా చక్కగా నడిపిస్తున్నాడు. దాంతో బిగ్ బాస్ 5 రానా చేతికి వచ్చిందట. ఇక ఈసారి రెండు రియాలిటీ షోలు ఒకేసారి ప్రసారం అయ్యే అవకాశం ఉందని సమాచారం. జూనియర్ ఎన్.టి.ఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఛానల్ నిర్వాహకులు అఫీషియల్‌గా ప్రకటించి ప్రోమో కూడా వదిలారు. ఈపాటికే మొదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ ప్లాన్ చేస్తున్నారట.