Love: చాలా మంది నేనంటే వాళ్లకు ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేదు అని తెగ బాధపడిపోతూ ఉంటారు. అసలు సరిగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరుఅన్నిటికన్నా ముందు వాళ్ళని వాళ్ళు ఇష్ట పడడం చాలా అవసరం. నిజంగా వాళ్ళని వాళ్ళు ఇష్టపడటం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు . కానీ తెలుసుకోవడం చాలా అవసరం.అసలు ఎందుకు ఎవరికీ వారు ఇష్టపడుకోవాలి ? ఒక వేళ ద్వేషించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి వాటి గురించి తెలుసుకుందాం.
సహజంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం అనేది ఉంటుంది. కానీ కొందరిలో ఈ లక్షణం ఉండదు. దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
ఎవరైతే తమని తాము ఇష్ట పడరో వారికి అసలు జీవితంలో తమ మీద తమకు నమ్మకం ఉండదు.
వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం లేక పోతే జీవితంలో ఎప్పుడు ,ఏది సాధించలేరు. అదే విధంగా ఏ పని చేయాలన్న కష్టమవుతుంది.
తమమీద తమకు ప్రేమ లేకపోవడం వలన మొదట ఇతరుల నుంచి సానుభూతి అందుతుందే తప్ప
ఇతరులు వాళ్ళని ప్రేమించరు. దీని కారణంగా ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు ఎదురవుతాయి.
అదే విధంగా ఎవరైతే వాళ్ల ని వాళ్ళు ప్రేమించుకోరో.. వాళ్లు దృఢమైన బంధాలను ని పొందారు.
అలాగే ఎప్పుడు ఇరిటేషన్ తో ఉండటం కారణంగా మంచి రిలేషన్ షిప్ అనేది ఉండదు.
తనను తాను ధ్వేషించుకోవడం వల్ల ఇతరుల మీద కూడా నమ్మకం అసలు ఉండదు. తన లాగే అందరూ భావిస్తారు అని అనుకుంటూ ఉంటారు.ఎవరై తే తనను తాను ప్రేమించుకోలేరో వాళ్ళు ఇతరులను కూడా ప్రేమించలేరు.. దీంతో జీవితాంతం ప్రేమను పొందలేరు .కాబట్టి అన్నిటికన్నా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అప్పడు అన్ని మీకు అనుకూలం గా జరుగుతాయి.