NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay: ముక్కు నేలకు రాసి ‘కేసిఆర్” పొర్లు దండాలు పెట్టాలంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Bandi Sanjay: ఏపి, తెలంగాణ జల వివాదం విషయంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వివాదంలో కేసిఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసిఆర్ తిరుమల పర్యటనకు వెళ్లిన సందర్భంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ సమయంలో కేసిఆర్, ఏపి సీఎం జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

Bandi Sanjay serious comments ok kcr
Bandi Sanjay serious comments ok kcr

Read More: Kambhampati Hari Babu: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు..! కంభంపాటికి వరించిన గవర్నర్ గిరి..!!

నీటి ఒప్పందాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకర పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు బండి సంజయ్. నాడు తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు, ఆంధ్రకు 512 టీఎంసీల నీళ్లు అని కేటాయింపులు చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కృష్ణాజలాల సమస్యపై కేంద్ర జలశక్తి మంత్రికి మొన్న లేఖ రాయడంతో పాటు చర్చించామని బండి సంజయ్ చెప్పారు. అయితే తాము మీడియాకు చెప్పలేదనీ, ఆయన (కేసిఆర్) బాగా లీకులు ఇస్తారన్నారు.

కేంద్ర మంత్రికి కేసిఆర్ ఫోన్ చేసి ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ, ఆ తరువాత మిస్డ్ కాల్ చూసిన కేంద్ర మంత్రి కాల్ బ్యాక్ చేశారన్నారు. అయితే దీనికి కేంద్ర మంత్రే తనకు ఫోన్ చేశారంటూ కేసిఆర్ ప్రచారం చేసుకున్నారన్నారు. నోరు తెరిస్తే అబ్దద్దాలేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసిఆర్ అన్యాయం చేశారనీ, దక్షిణ తెలంగాణను ఎడారిగా చేశారని దుయ్యబట్టారు.

తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలైతే శ్రీశైలం ప్రాజెక్టులో దూకి చచ్చిపోయేందుకైనా సిద్ధమని బండి స్పష్టం చేశారు. తాను చెప్పింది నిజమైతే సీఎం కేసిఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకేసి రాసి పొర్లుదండాలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి సీఎం కేసిఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N