Akkineni akhil: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం అక్కినేని కుటుంబం నుండి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు సరైన విజయాన్ని అందుకోలేక పోయారు. అక్కినేని హీరోలు అదే రీతిలో అక్కినేని అభిమానులు… అఖిల్ కి సరైన హిట్ ఎప్పుడు పడుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందం పరంగా.. టాలెంట్ పరంగా అన్నీ ఉన్నా గాని.. ఇప్పటివరకు అఖిల్ కి అదృష్టం కలిసి రాక మరి ఏమో తెలియదు గానీ హిట్ పడలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నా గాని.. ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. అఖిల్ ఏజెంట్ అనే సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈ సినిమాలో చాలా మాస్ లుక్ లో… జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్ అన్న రీతిలో.. అఖిల్ లుక్ ఉండటం జరిగింది.
Read more: Akkineni akhil: అక్కినేని అఖిల్ ఏజెంట్ లో విలన్ పాత్రలో సీనియర్ సూపర్ స్టార్..??
ఇదిలా ఉంటే ఈ సినిమాలో దాదాపు 40 నిమిషాల లేడీ పాత్ర సినిమాకి హైలెట్ అన్నట్టు దానికోసం సురేందర్ రెడ్డి… హీరోయిన్ రష్మిక మందన ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపూర్ సినిమాలో హీరో పాత్రకు ఎంత బేస్ ఉంటుందో అదే తరహాలో ఈ లేడీ క్యారెక్టర్ కి ఉన్నట్లు దీని కోసం అనేక మంది హీరోయిన్లను అనుకున్నా కానీ చివరాకరికి.. రష్మిక మందన కి సురేందర్ రెడ్డి.. ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.