Aakanksha singh : నేచురల్ స్టార్ నాని హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన టక్ జగదీష్ సినిమాలో నటించాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్యామ్ సింగ రాయ్, అంటే..సుందరానికి సెట్స్ మీదున్నాయి. ఇలా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న నాని తన నిర్మాణంలో మంచి సబ్జెక్ట్స్ తో ప్రయోగాలను చేస్తున్నాడు. ఇప్పటికే అ..! సినిమాను నిర్మించిన మన నేచురల్ స్టార్ ఇటీవల ‘మీట్క్యూట్’ అనే సినిమాను ప్రకటించాడు.
ఈ సినిమాకి నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తుండడం ఇక్కడ మరో విశేషం. ఇక ఈ సినిమా కథ ప్రకారం ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారని కొత్తగా టాక్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ముగ్గురు హీరోయిన్లు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎనిమిది వార్తలు వస్తున్నాయి. ఆ 8 మందిని కూడా బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్నే తీసుకోవాలని నాని చూస్తున్నాడు. ఇంతకముందు నాని నిర్మించిన ‘అ..! లోనూ ముగ్గురు హీరోయిన్స్ నటించారు.
Aakanksha singh : ఆకాంక్షసింగ్ ‘మళ్ళీరావా’ సినిమాలో నటించింది.
ఇప్పుడు నిర్మిస్తున్న ‘మీట్క్యూట్’ సినిమాలో ఒక పాత్రకు హీరోయిన్ ఆకాంక్షసింగ్ ను ఎంపిక చేసుకున్నారట. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలు ఫస్ట్ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారట. ఆకాంక్షసింగ్.. నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్’ సినిమాలో నాగార్జునకి జంటగా నటించింది. అంతకు ముందు సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీరావా’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు తనకి మంచి పేరు తీసుకువచ్చాయి. దాంతో నాని ఆమెకి ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అదాశర్మ ఓ పాత్రకి ఫైనల్ అయింది. మిగతా వారిని కూడా ఒక్కరిగా ప్రకటించనున్నారు.