NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ap High Court: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

Ap High Court: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపి హైకోర్టులో  మంగళవారం విచారణ జరిగింది. మాన్సాస్ ట్రస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుతో సహా ట్రస్ట్ ఉద్యోగులపై ఇఓ ఫిర్యాదు మేరకు ఇటీవల విజయనగరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపి హైకోర్టు ఇఓ ఫిర్యాదుపై నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

Ap High Court hearing on ashok gajapathi raju petition
Ap High Court hearing on ashok gajapathi raju petition

మాన్సాస్ ట్రస్ట్ ఇఓ వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గత నెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజును కలిశారు. అనంతరం ఉద్యోగులు వేతనాల నిలుపుదల చేసినందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. జీతాలు నిలిపివేతపై ఇఓ ను నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఈఓకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనపై ఇఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ఈఓ పై దాడికి ప్రేరేపించారన్న అభియోగాలతో అశోక్ గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

Ap High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంచయిత

కాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన నేపథ్యంలో అశోక్ గజపతిరాజు తిరిగి ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో సంచయిత నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అన్న అంశంపై ఈ నెల 10వ తేదీన హైకోర్టు విచారణ జరగనున్నది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju