NewsOrbit
న్యూస్

Pawan Kalyan: ప్రధాన మంత్రి మోడికి థ్యాంగ్స్ చెప్పిన పవన్ కళ్యాణ్..! ఎందుకంటే..?

Pawan Kalyan: దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులపై పలు ప్రదేశాలలో రన్ వేలను నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 13 చోట్ల రన్ వేలను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ లోని బర్మేర్ నందు నిర్మించిన హైవే ఎయిర్ స్ట్రిప్ ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు పరిశీలించారు. అదే మాదిరిగా ఏపిలోని ప్రకాశం జిల్లాలో రెండు ప్రదేశాలలో ఈ అత్యవసర రన్ వేలు నిర్మిస్తున్నారు.

Pawan Kalyan appreciates pm modi for two highway air strips in prakasam district
Pawan Kalyan appreciates pm modi for two highway air strips in prakasam district

ప్రకాశం జిల్లా కొరిశపాడు – రేణంగివరం వరకు రూ.23.77 కోట్లతో 5 కిమీ పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకే సారి నాలుగు విమానాలు, ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తున్నారు.  కలికివాయి – సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలో మీటర్ల పొడవైన రన్ వే నిర్మిస్తున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్ తో రన్ వే, రెండు వైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్ వేకి 150 మీటర్ల దూరంలో ఏటీసీ టవర్ భవనం నిర్మాణం చేయనునారు. ప్రస్తుతం రన్ వే సంబంధించిన కాంక్రీట్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇరువైపులా డ్రైనేజీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగ ప్రజల తరపున  ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో అత్యవసరంగా విమానాలు దిగేలా రన్ వే లు నిర్మించడం అభినందనీయమన్నారు. దేశ భద్రత పకృతి వైపరీత్యాలు  వలల్ తలెత్తే అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపై సైతం విమానాలు దిగేలా నిర్మాణాలు చేపడుతున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

ఇప్పటికే రాజస్థాన్ లోని బడ్మేర్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ తలమానికంగా నిలుస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విశిష్ట పథకాన్ని ఏపిలో కూడా అమలు చేస్తున్నందున తెలుగు ప్రజల తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?