NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CMRF Scam: సీఎం సహాయ నిధి చెక్కుల కుంభకోణం..! ఆ నలుగురు ఆరెస్టు..!!

CMRF Scam: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును వేగవంతంగా చేసింది. ఏపి సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసిబీ గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు. దీనిపై గత ఏడాది సెప్టెంబర్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు తాజాగా ఆసుపత్రుల నుండి సేకరించిన సమాచారంతో గుర్తించారు.

ACB arrests four accused people in CMRF Scam
ACB arrests four accused people in CMRF Scam

2014 నుండి సిఎంఆర్ఎఫ్ లో అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో ఏసీబీ గుర్తించింది. తప్పుడు పేర్లు, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను కైంకర్యం చేసినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ లో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో రంగంలో దిగి విచారణ చేపట్టిన ఏసీబీ నేడు నలుగురు నిందితులను అరెస్టు చేసింది. సీఎంఆర్ఎఫ్ లో సబార్డినేట్లుగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ఓ ప్రజా ప్రజా ప్రతినిధి వద్ద ప్రైవేటు పిఏగా పని చేసిన ధనరాజ్ అలియాస్ నాని, ఒంగోలుకు చెందిన మురళీకృష్ణలను అరెస్టు చేశారు.

సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడీ, పాస్ వర్డులను సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లైయిమ్స్ తో నిధులు గోల్ మాల్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. 2014 నుండి ఓ ప్రజా ప్రతినిధి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పని చేస్తూ ధనరాజ్ అలియాస్ నాని అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది ఏసీబీ. ఇప్పటి వరకూ 88 ఫైళ్లలో అక్రమాలు జరిగినట్లు, కోటి రూపాయలకు పైగా అక్రమ లావాదేవీలు బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో ఏసీబీ దృవీకరించింది.

Read More: BJP Vs YCP: మతం కార్డు పని చేయక ఏపిలో కులం కార్డు వాడుతున్న మోడీ..? సోము వీర్రాజుతో కొత్త ప్రయత్నం..!!

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N