NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: వైసీపీ నేతల విమర్శలపై గ్రామ సింహాల గోంకారాలు అంటూ తనదైన స్టైల్ లో బదులిచ్చిన పవన్ కల్యాణ్..!!

Pawan Kalyan: punch to ycp ministers

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు సంబంధించి ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రిరిలీజ్ ఫంక్షన్ నందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపి మంత్రులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు ఏపి మంత్రులు. మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ లు తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు. అయితే వీరి విమర్శలపై పవన్ కళ్యాణ్ అదే రీతిలో విమర్శలు సంధించకుండా తన దైన స్టైల్ లో కవిత రూపంలో వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.

Pawan Kalyan: punch to ycp ministers
Pawan Kalyan: punch to ycp ministers

“తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే” అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కరీబియన్ మ్యూజిక్ బ్యాండ్ బహో మెన్ అలపించిన హు లెట్స్ ద డాగ్స్ అవుట్ ( ఈ కుక్కలను బయటకు వదలింది ఎవరు?) అనే పాట వీడియోను కూడా పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేశారు. ఈ పాట తనకు ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

కాగా ఈ ట్వీట్ పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా బాగా పరిణితి చెందారు అంటూ ప్రశంశించారు. ప్రత్యర్ధుల బూతు పురాణాలకు స్పందించకుండా వారి అసభ్య పదజాలాన్ని జంతువుల ఘీంకారాలతో పోల్చి చావు దెబ్బ కొట్టారంటూ కొనియాడారు. మరి ఈ బూతు ప్రవచనా శ్రేష్టులకు మీ కవి హృదయం అర్ధం అవుతుందా నట శ్రేష్టా అని సందేహం వ్యక్తం చేశారు వర్ల రామయ్య. మన రాష్ట్రాన్ని ప్రస్తుతం ఆ దేవుడే కాపాడాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju