“RRR”: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజామౌళి సినిమా అంటే మేకింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తారో ఆయన తీసిన విజువల్ వండర్స్ బాహుబలి సినిమా సిరీస్‌లు చూస్తే అర్థమవుతుంది. కథకంటే కూడా గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వర్క్ కోసమే సగానికి పైగా బడ్జెట్ ఖర్చు చేయిస్తారు. అంతేకాదు ఆయన సినిమాల ప్రమోషన్స్ కోసమూ భారీగా ఖర్చు పెట్టిస్తారనే టాక్ ఉంది. త్వరలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ వరకు చెక్కుతూనే ఉండే రాజమౌళి..రిలీజ్ వరకు ప్రమోషన్స్‌ను పీక్స్‌లో నిర్వహిస్తుంటారు.
వీలైనంతవరకు ప్రేక్షకులు తన సినిమాను తప్పకుండా చూడాల్సినే అనే భావనకు వచ్చేలా కొత్త తరహాలో జక్కన్న ప్రమోషన్స్ చేస్తుంటారు. దీనివల్ల సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడతాయి. దీని కోసం పెద్ద పెద్ద దర్శకులను, హీరోలను చాలా బాగా వాడేస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి టార్గెట్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఎక్కువగా బాలీవుడ్లో ప్రమోట్ చేయడం..అక్కడ సినిమా వసూళ్ళు భారీ స్థాయిలో దక్కేలా చేయడమే గట్టిగా పెట్టుకున్నారు. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది.
“RRR”: గాడ్ ఫాదర్ సినిమాలోనూ చిరుతో కలిసి సందడి చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ టాలీవుడ్ హీరోలతోనూ, దర్శకులతోనూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటాడు. ఒక్క సల్మాన్ మాత్రమే కాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కూడా టాలీవుడ్ సినిమాల మీద ఇక్కడ, హీరోలు, దర్శకుల మీద ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. బాహుబలి తర్వాత రాజమౌళికి బాలీవుడ్ లో బాగా క్రేజ్ పెరిగింది. ఇక సల్మాన్ మెగాస్టార్ చిరంజీవి – రాం చరణ్‌లకు బాగా క్లోజ్ అనే విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలోనూ చిరుతో కలిసి సందడి చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌కు కూడా సల్మాన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న రాజమౌళి బాగానే ఖర్చు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.