NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Police: ఏపీలో ఓ మంత్రితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..! ఎవరు వాళ్లు..? ఎందుకంటే..?

AP Police: ఏపిలోని ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి కొడాలి నానితో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో వీరికి వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో వారికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై వారు ఫిర్యాదు చేయగా, వారి భద్రతను కమిటీ సమీక్షించింది. టీడీపీ సానుభూతిపరులు ఈ నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రత పెంపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

AP Police: additional security to ap minister and three mlas
AP Police: additional security to ap minister and three mlas

Read More: AP Capital Issue: జగన్ వెనుకడుగు వెనుక ఈ భారీ వ్యూహం..??

AP Police: మంత్రి కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతకు అదనంగా 1 ప్లస్ 4 గన్ మెన్ లను ఏర్పాటు చేయడంతో పాటు కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1 ప్లస్ 1 గన్ మెన్ లతో పాటు అదనంగా 3 ప్లస్ 3 గన్ మెన్ భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుండే అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్

ఇటీవల అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు తనతో పాటు తన భార్యను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీని బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు అనంతరం టీడీఎల్పీ సమావేశంలో భావోద్వేగానికి గురై తీవ్రంగా ఏడ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణులతో పాటు ఆ పార్టీ సానుభూతిపరులు, సాధారణ ప్రజానీకానికి ఆగ్రహం కల్గించింది. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. పలువురు ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ చేసి సంఘీభావం కూడా ప్రకటించారు. పలువురు టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును విమర్శించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో మంత్రితో సహా ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అదనపు  భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N