NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly:  ఏపి అసెంబ్లీలో రెండు కీలక బిల్లులకు ఆమోదం..!!

AP Assembly: ఏపి శాసనసభ బుధవారం రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన సినిమాటోగ్రఫీ బిల్లు కూడా ఉంది. మరొకటి వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించనున్నారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపి సినిమాస్ రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. బిల్లు లక్ష్యాన్ని మంత్రి చదివి వినిపించారు. ఈ సందర్భంలో మంత్రి పేర్ని నాని ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. ఆన్ లైన్ టికెట్ ల విక్రయాన్ని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ధియేటర్ల యాజమాన్యం స్వాగతిస్తుంటే ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీకి వంత పాడే నాయకుడు విమర్శిస్తున్నారని అన్నారు. దీని వల్ల వాళ్లకు వచ్చే ఇబ్బంది ఏమిటో అర్ధంకావడం లేదన్నారు. రైలు టికెట్లు, బస్సు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తే అదే మాదిరిగా సినిమాకు వెళ్లాలనుకునే వారు ఇళ్లలోనే కూర్చుని ఆన్ లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసుకుంటారని చెప్పారు.

AP Assembly key bills passed
AP Assembly key bills passed

Read More: AP Police: ఏపీలో ఓ మంత్రితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..! ఎవరు వాళ్లు..? ఎందుకంటే..?

AP Assembly: సినిమా థియేటర్ లలో ఇక నాలుగు షోలే..

ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇకపై ధియేటర్ లలో ఇష్టానుసారంగా షోలు వేయడానికి వీలులేదనీ, నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. సినిమా ధియేటర్ లలో రోజుకు నాలుగు షోలను మాత్రమే వేయాల్సిన చోట ఇష్టానుసారంగా ఆరేడు వేస్తున్నారనీ, బెనిఫిటే షోల పేరుతో టికెట్ కు రూ.500లు నుండి రూ.1000ల వరకూ వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం సినిమా ధియేటర్ లలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు ఆన్ లైన్ టికెట్ ప్రక్రియ ద్వారా అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే టికెట్ ధరలు నిర్ణయించాల్సి ఉంటుందనీ, ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లోనే షోలు ప్రదర్శించాలన్నారు. రాష్ట్రంలోని 1100 ధియేటర్ లలో ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం చేపడతామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న హీరోలు, పెద్ద హీరోల సినిమాలు అనే వ్యత్యాసాలు లేవన్నారు.

 

వాహనాలకు గ్రీన్ ట్యాక్స్

అలానే వాహన చట్టంలోనూ సవరణలు చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్త వాహనాల ట్యాక్స్ ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ లలో పెంపుదల చేస్తూ సవరించారు. కొత్త వాహనాలకు 1 శాతం నుండి 4 శాతం వరకూ లైఫ్ ట్యాక్స్ పెంచారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ.409 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనా. మోటారు సైకిళ్లు, ఆటోలకు  ఈ పన్ను వర్తించదని స్పష్టం చేశారు. రూ.20లక్షల విలువ దాటిన ఫోర్ వీలర్స్ పై 4 శాతం గ్రీన్ ట్యాక్స్ ఉంటుందని తెలిపారు.

 

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N