NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna- Puri jagannadh: మళ్ళీ పైసా వసూల్..బాలయ్య నెక్ట్స్ మూవీ పాన్ ఇండియన్ రేంజ్..!

Balakrishna- Puri jagannadh: నట సింహం నందమూరి బాలకృష్ణ త్వరలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అని ఇప్పటి వరకు అఖండ సినిమా నుంచి వచ్చిన ప్రతీది చూస్తే అనిపిస్తున్నాయి. రెండు విభిన్నమైన పవర్‌ఫుల్ పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నారు. డిసెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న అఖండ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

balakrishna-puri-jagannadh-next movie pan indian range
balakrishna-puri-jagannadh-next movie pan indian range

నవంబర్ 13న ఘనంగా ప్రారంభం అయిన బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా డిసెంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య మరో సినిమాను చేయనున్నారని సమాచారం. ఇంతకముందు బాలయ్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీటవుతుండటంతో అంచనాలు బాగానే
ఉన్నాయి.

Balakrishna- Puri jagannadh: 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంలో బాలకృష్ణ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్..!

ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమా తర్వాత సొంత బ్యానర్‌లోనే బాలయ్యతో సినిమా చేయబోతున్నారు పూరి. ఇది పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందనుందని సమాచారం. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక యాత్ర సినిమాను నిర్మించిన 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కూడా బాలకృష్ణ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri