NewsOrbit
న్యూస్

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్ …!

Electric Vehicles:  దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యమైనంత మేర పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతేకాకుండా భవిష్యత్ మొత్తం ఈవీ మీద ఆధారపడుతుందనే సంకేతాలు ఇస్తున్నది కేంద్రం… ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వాడేలా చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాకాలు మొదలెట్టింది. అయితే, ప్రస్తుతం ఈవీ చార్జింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటం వలన చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు వెనుకాముందు అవుతున్నారు. తాజాగా ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఏపీ కొత్త పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ నెడ్‌క్యాప్‌ (NREDCAP) చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

 

Electric Vehicles: నెడ్ క్యాప్ కీలక నిర్ణయం..

 

ఇందుకోసం తాజాగా ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం టైరెక్స్‌, స్టాటిక్‌ అనే సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి లోపు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కనీసం 100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాయి. నెడ్‌క్యాప్‌ కంపెనీ ప్రధాన పట్టాణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. లో బ్యాటరీ కెపాసిటీ గల టూవీలర్ ధర రూ.60వేలలోపే ఉంటోంది. చార్జింగ్ స్టేషన్లు పెంచితే ఈవీ వాహనాల వినియోగదారులు పెరుగుతారు. అందుకోసమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

 

ఫాస్ట్ చార్జింగ్.. దేశవ్యాప్తంగా 22వేల స్టేషన్లు

కేంద్రం ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. గంటల తరబడి ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు చార్జ్ చేయాల్సిన పనిలేదు. అందుకేసమే కేంద్రం దేశవ్యాప్తంగా 22 వేల చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం వివిధ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతోంది కేంద్రం.. ముందుగా ప్రధాన పట్టణాల్లో 3 కిలోమీటర్ల లిమిట్స్‌లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, రహదారులపై 25 కిలోమీటర్ల పరిధిలో చార్జింగ్ పాయింట్లను నెలకొల్పాలని ప్రణాళికలు చేసింది. ఈ విధంగా చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ప్రజలు కూడా చార్జింగ్ వెహికిల్స్ తీసుకోవడానికి సిద్ధపడతారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju