NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Teachers Protest: పోలీస్ యాక్షన్..అయినా తగ్గేదిలే అంటూ కదం తొక్కిన ఉపాధ్యాయులు..

Teachers Protest: ఏపి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. మరో పక్క కలెక్టరేట్‌ల ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలను రాత్రి నుండి అడ్డుకున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులు జారీ చేసి చాలా జిల్లాల్లో నేతలను గృహ నిర్బంధాలు చేశారు. నోటీసులను పట్టించుకోకుండా వెళ్లే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు.

ap Teachers Protest against prc go
ap Teachers Protest against prc go

 

Teachers Protest: నెల్లూరులో ఉద్రిక్తత

నెల్లూరు, ఒంగోలు, విశాఖ, చిత్తూరు, కడప, మచిలీపట్నం, ఏలూరు తదితర జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది. నెల్లూరులో పోలీసు వలయాన్ని ఛేదించి ఉపాధ్యాయులు ముందుకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ కు వెళుతున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా పోలీస్ స్టేషన్ వద్దే నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ నేతల అరెస్టు

చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి మధుసూధన్, కడప జిల్లాలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, శ్రీకాకుళంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బాబూరావు ఇలా అన్ని జిల్లాల్లో ముఖ్య నేతలను గృహ నిర్బంధం, అరెస్టులు చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటుంటే అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. రివర్స్ పీఆర్సీ జివోలను వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju