NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TSRTC: రైతుకు కోపం వచ్చింది.. ఆర్టీసీ పరువు పోయింది..!

farmer false protest on tsrtc

TSRTC: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఆర్టీసీ సేవలకు మంచి గుర్తింపు ఉంది. పల్లెల్లో ప్రజలకు అనువైన రవాణా సాధనం ఆర్టీసీ బస్సు. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ తన సేవల్లో ఏ మార్పూ లేకపోగా.. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తున్నాయి. ప్రజా రవాణా మాత్రమే కాకుండా పార్శిల్ సేవలు కూడా అందిస్తోంది. నిత్యం ప్రజా జీవనంలో మమేకమైన ఆర్టీసికి తెలుగు ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. అటువంటి ఆర్టీసీ కొందరి వల్ల అపఖ్యాతి కూడా మూటగట్టుకుంటోంది. ఇందుకు తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామంలో జరిగిన సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఓ రైతు పండించిన పంటపై ఆర్టీసీ డ్రైవర్ చూపిన అత్యాశ.. ఆ రైతుకు ఆగ్రహం తెప్పించింది.

farmer protest on tsrtc
farmer protest on tsrtc

బొప్పాయి పండ్ల కోసం..

నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామానికి రోజూ అచ్చంపేట డిపో  నుంచి బస్సు నడుస్తుంది. గ్రామానికి చెందిన గోపయ్య అనే రైతు తన పొలంలో పండించే బొప్పాయి పండ్లను నిత్యం సమీపంలోని కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకెళ్లి అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలోనే శుక్రవారం బొప్పాయిని బస్సులో తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వగా ఆర్టీసీ డ్రైవర్ ఉచితంగా పండ్లు ఆశించాడు. రైతు తిరస్కరించడంతో బస్సు ఎక్కించుకోకుండా వెళ్లిపోయాడు. తీవ్ర ఆవేదనకు గురైన రైతు బస్సు కొల్లాపూర్ నుంచి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్ల బుట్టలు అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేశాడు. బస్సును గంటసేపు కదలనీయలేదు. దీంతో ఈ సంఘటన సంచలనం రేపింది.

ఉన్నతాధికారుల కష్టం..

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు, ప్రకటనలు, ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం సుఖవంతం.. ప్రజలకు ప్రియ నేస్తం అనే కాన్సెప్టుతో ప్రజల్లోకి సంస్థను తీసుకెళ్తున్నారు. హీరో అల్లు అర్జున్ నటించిన ఓ యాడ్ లో ఆర్టీసీని కించపరిచే విధంగా ఉందంటూ ఆ సంస్థపై కేసు కూడా పెట్టారు. సంక్రాంతికి రేట్లు కూడా పెంచలేదు. ఇంతగా ప్రజలకు చేరువ చేస్తూ.. సంస్థ ప్రతిష్టను పెంచేలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే.. కొందరు చేస్తున్న ఇటువంటి పనులు వారి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నాయి. ఇప్పటికైనా తమ తీరుతో ప్రజలను ఆకట్టుకోవాలే కానీ.. ఇబ్బందులకు గురి చేయకూడదు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju