NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Political Trending: పేకాట ఆడుతూ టీడీపీ ఇంచార్జి అరెస్టు.. క్యాసినో గేమ్ నుండి వైసీపీ సేఫ్..!

Political Trending: TDP Leader Arrested - YCP Safe in Casino

Political Trending: రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 12 రోజుల నుండి గుడివాడ – క్యాసినో అంశమే హైలైట్ అవుతూ వస్తుంది.. ఈ క్యాసినో రాజకీయంలో ఒకరకంగా మంత్రి కొడాలి నాని పీకల్లోతు ఇరుక్కుపోయారు.. జిల్లాల విభజన అంశం తెరమీదకు రాకుంటే.., నిన్న విజయవాడ టీడీపీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాకుంటే.. పేకాట ఆడుతూ టీడీపీ ఇంచార్జి అరెస్టు కాకుంటే వైసీపీకి ఈ విషయంలో సమాధానం కూడా దొరికేది కాదు..! అయితే ఈ క్యాసినో రాజకీయంలో మొత్తానికి కొడాలి సేఫ్, వైసీపీ సేఫ్.. అటూ, ఇటూ తిరిగి తిరిగి ఇప్పుడు టీడీపీ ఇతర అంశాల్లో, ఆరోపణల్లో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం దగ్గర్లోని భీమిలి బీచ్ లోని ఓ రిసార్ట్ లో ఏలూరు కి చెందిన టీడీపీ నాయకులు ఇంచార్జి బడేటి చంటి సహా మరో 20 మంది కలిసి పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రిసార్ట్ పై దాడి చేసి ఈ నాయకులను అరెస్టు చేసారు. రూ. 5 లక్షల నగదు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నారు.. అదే సమయంలో విజయవాడలో వినోద్ జైన్ అనే టీడీపీ నేత 14 ఏళ్ళ బాలికపై లైంగిక వేధింపులు చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.. ఇలా ఈ రెండు ఘటనలతో టీడీపీ కాస్త డిఫెన్స్ లో పడింది.. వైసీపీ సేఫ్ కి వెళ్ళిపోయింది..!

Political Trending: TDP Leader Arrested - YCP Safe in Casino
Political Trending: TDP Leader Arrested – YCP Safe in Casino

Political Trending: క్యాసినో క్యా సీన్ హై..!!

నిజానికి గుడివాడలో క్యాసినో జరగలేదా..!? ఏమీ జరగలేదా..!? అంటే నూటికి నూరు శాతం జరిగింది. గుడివాడలోని కొడాలి కి చెందిన కె కన్వెన్షన్ పక్కనే ఉన్న రెండున్నర ఎకరాల స్థలం లీజుకి తీసుకుని.. ఒక ఎకరం ప్రదేశంలో పేకాట.. ఒక అరెకరం ప్రదేశంలో కోడి పందాలు.., ఇంకో పక్కన ఎడ్ల పందాలు.. ఇలా అన్ని నిర్వహించారు. కాకపోతే కొడాలి నాని నోరు పెద్దది. పదవి పెద్దది. పైగా టీడీపీకి బద్ధమైన ద్వేషి అని జగన్ దగ్గర కాస్త గుర్తింపు ఉంది. అందుకే అవకాశం దొరికింది కదా అని నోటికి పని చెప్పి.., ఆ క్యాసినో ఇష్యూని చుట్టూ తిప్పి తిప్పి చివరికి తానే పీకల్లోతు ఇరుక్కునే ప్రమాదంలోకి వెళ్లి తప్పించుకున్నారు. చివరికి ఇతర గేమ్స్ లో టీడీపీ తనకు తాను దొరికిపోయింది. అందుకే వైసీపీ సేఫ్.. టీడీపీ కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది.

Political Trending: TDP Leader Arrested - YCP Safe in Casino
Political Trending: TDP Leader Arrested – YCP Safe in Casino

ఎన్టీఆర్ పేరుతో మరో గేమ్..!?

ఇక ఇక్కడితో వైసీపీ గేమ్ అయిపోలేదు. కొడాలి నాని ఆ క్యాసినో అంశం జనం మర్చిపోయేలా చేసి.. మరో అంశంలో తాను ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. కృష్ణా జిల్లాను విభజించిన తరుణంలో విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడం వెనుక సీఎం జగన్ ఆశించిన రాజకీయ ప్రయోజనాన్ని తనకు కట్టబెట్టే తీవ్ర ప్రయత్నంలో కొడాలి నాని నిమగ్నమయ్యారు. చంద్రబాబు అంటే ద్వేషించే.. ఎన్టీఆర్ అంటే పూజించే టీడీపీ లేదా న్యూట్రల్ కమ్మ ఓట్లు కాస్తో, అవి వైసీపీకి పడేలా చేయడం అనే ఒక అంటారా ఉద్దేశంతో కొడాలి గేమ్ స్టార్ట్ చేసారు. మొత్తానికి ఆ క్యాసినో నుండి తప్పించుకోవడం.. పనిలో పనిగా జిల్లాల విభజన రాజకీయం తెరపైకి రావడం.. ఎన్టీఆర్ పేరు వైసీపీ ప్రయోజనకర్తగా మారిపోవడం.. సరిగా అదే టైం లో టీడీపీ నేతలు ఈ కేసుల్లో ఇరుక్కోవడంతో ఇప్పుడు వైసీపీ సేఫ్ .. టీడీపీకి నెగిటివ్ పవనాలు వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు..!

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?