NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: రాజధాని విశాఖపట్నం ఖాయం..జగన్ టేబుల్ పై ఓ ప్లానింగ్..?

CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది అనుకున్నారు. అయితే ఆ బిల్లు ఉపసంహరణ సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధాని వికేంద్రీకరణకు మెగురైన బిల్లు తీసుకువస్తామని వెల్లడించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న వైసీపీ అభిలాషకు ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి షిప్ట్ చేయాలన్న ప్లాన్ లో ప్రభుత్వం ఉంది. అందుకు గానూ అన్ని రకాల వ్యవస్థల తెరవెనుక ఉండి ఏమి చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు రాజధానుల అంశంపై ప్రత్యక్షంగా గేమ్ మొదలు పెట్టారు. అయితే చట్ట పరంగా నిలవలేదు. రాజధాని విషయంలో రైతులు తమ పట్టు వదలడం లేదు. గతంలో తీసుకువచ్చిన బిల్లు చట్ట ప్రకారం ఆమోదం పొందలేదు.

CM YS Jagan Visakhapatnam capital
CM YS Jagan Visakhapatnam capital

CM YS Jagan:  ఏదో విధంగా కొందరు రైతులను ఒప్పించి..

ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ప్రత్యక్షంగా రాజధాని వికేంద్రీకరణ చేయాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు అని తెలుసుకుని పరోక్ష పద్ధతిలో అడుగులు వేస్తోంది. వికేంద్రీకరణకు సంబంధించి తెరవెనుక మార్గం ద్వారా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. న్యాయస్థానం నుండి చిక్కులు రాకుండా ఉండేందుకు గానూ ముందుగా ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతుల్లో విభజన తీసుకువచ్చి వారిలో కొందరిని ఏదో రకంగా పరిపాలనా వికేంద్రీకణకు ఒప్పించి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేయాలి. ఏప్రిల్ లేదా మే మొదటి వారం నాటికి విశాఖ నుండి పరిపాలన మొదలు పెట్టాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి గానూ మార్చి మొదటి వారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకురానున్నారు అనేది ఒక కచ్చితమైన సమాచారం.

CM YS Jagan:  రాజధాని విషయంలో వైసీపీ పట్టుదల ఎందుకంటే.. ?

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని వైసీపీ ఎందుకు అంత పట్టుదలగా ఉంది అంటే.. గత రెండు సంవత్సరాలుగా విశాఖలో రాజధాని వచ్చేస్తుందంటూ ప్రచారం జరగడంతో భూముల ధరలు పెరిగిపోయాయి. భూముల అక్రమ లావాదేవీలు జరిగిపోయాయి. పరిపాలనా రాజధాని అవ్వకపోవడంతో ఇప్పుడు భూముల ధరలు తగ్గుతున్నాయి. పరిపాలనా రాజధాని వస్తుందని ఆశలు కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు అది నెరవేర్చకపోవడంతో వైసీపీకి ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. దీనితో పాటు రాజధాని వికేంద్రీకరణ అన్నారు. రెండేళ్లు దాటి పోయినా ఏమీ జరగలేదు. ఇప్పుడు బిల్లు వెనక్కు తీసుకోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఒక అపనమ్మకం వచ్చే పరిస్థితి ఏర్పడింది.

కోర్టులు తప్పుబట్టకుండా వికేంద్రీకణ బిల్లు

దీంతో అసెంబ్లీలో చెప్పిన విధంగా రాజధాని వికేంద్రీకరణ చేసి తీసి తీరాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. గతంలో బిల్లు తీసుకువచ్చిన సందర్భంలో తప్పులు జరిగాయి. ఇప్పుడు ఆ తప్పులు ఏమి లేకుండా కోర్టులు తప్పుబట్టకుండా వికేంద్రీకణ బిల్లును తీసుకువచ్చి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకే బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ మంత్రులు అందరూ పదేపదే విశాఖపట్నం రాజధానిగా చేస్తామనే చెబుతున్నారు. బిల్లు వెనక్కు తీసుకున్నప్పటికీ పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామని చెబుతున్నారు. అందుకు ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju