NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: కడపలో రూ.1500 కోట్లతో ముల్క్ హోల్డింగ్స్ హాబ్ .. సీఎం జగన్ తో సంస్థ చైర్మన్ భేటీ..

CM YS Jagan: దివంగత ఏపిపరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడానికి ముందు పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలు కీలక పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు నిర్వహించడంతో పాటు పలు సంస్థలను ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. అప్పుడు గౌతమ్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్న ముల్క్ హోల్డింగ్స్ ఏపిలో తమ హబ్ ఏర్పాటు చేసేందుకు సంసిగ్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ నవాబ్ షాజీ ఉల్ ముల్క్ తన ప్రతినిధి బృందంతో మంగళవారం తాడేపల్లికి వచ్చి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సమావేశమైయ్యారు.

Mulk Holdings Chairman Nawab Shaji Ul Mulk meet CM YS Jagan
Mulk Holdings Chairman Nawab Shaji Ul Mulk meet CM YS Jagan

CM YS Jagan: కడప జిల్లాలో కొపర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్

గౌతమ్ రెడ్డి సమక్షంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం కడప జిల్లాలో కొపర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ తెలిపారు. తమ బిజినెస్ ప్రణాళికపై సీఎంతో చర్చించారు. అల్యూమినియం కాయల్స్ తయారీ, కాయల్ కోటింగ్ కు ఉపయోగించే హై పర్ఫామెన్స్ పెయింట్స్ తయారీ, అల్యూమినియం కాయన్ కోటింగ్ ప్రొడక్షన్ లైన్స్, ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మినరల్ కోరోస్ ప్రొడక్షన్ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్ ఫ్యానెల్స్, మెటల్ కాంపోజిట్ మెటీరియల్స్ ప్రొడక్షన్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది.

 

ఇందు కోసం ముల్క్ హోల్డింగ్స్ సంస్థ రూ.1,500 కోట్లను వెచ్చించనుంది. ఈ హబ్ తో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సమావేశంలో మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాలలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రౌడ్జీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జువ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?