NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Congress: రాహుల్ గాంధీ తో రేపు జగ్గారెడ్డి భేటీ ..అసమ్మతి సమసేనా..?

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎట్టకేలకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఖరారు అవ్వడంతో ఆయన ఫ్యామిలీతో సహా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జగ్గారెడ్డితో పాటు ఆయన సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఢిల్లీలో సోమవారం సోమవారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశానికి రావాల్సిందిగా రాహుల్ గాంధీ నుండి జగ్గారెడ్డికి పిలుపు వచ్చింది.

Telangana Congress leaders meeting with rahul Gandhi tomorrow
Telangana Congress leaders meeting with rahul Gandhi tomorrow

Read More: T Congress: టీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు .. సీఎల్పీ నుండి జగ్గారెడ్డి బాయ్ కాట్

Telangana Congress: తలనొప్పిగా సీనియర్ నేతల గ్రూపు రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో పలువురు సీనియర్ నేతల గ్రూపు రాజకీయాలు నిర్వహించడం తలనొప్పిగా మారింది. ఇటీవల హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సీనియర్ నేత వి హనుమంతరావు, జగ్గారెడ్డి తదితర నేతలు అసమ్మతి భేటీ జరిగింది. ఆ రోజు అసమ్మతి సమావేశం ఏర్పాటు చేయవద్దని కూడా పార్టీ హై కమాండ్ నుండి సమాచారం వచ్చినా వీరు సమావేశం నిర్వహించారు. రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నేతలు మాట్లాడారు. పార్టీ అధిష్టానం నుండి ఫోన్ రావడంతో కొందరు నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం

తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించిన తరువాత పార్టీ క్యాడర్ లో కొంత జోష్ వచ్చింది. అధికార టీఆర్ఎస్ పై, సీఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పార్టీ నుండి వెరే పార్టీలకు వెళ్లిన వారిలో కొందరు మరల తిరిగి వచ్చేందుకు ఆలోచన చేస్తున్న తరుణంలో మళ్లీ గ్రూపు రాజకీయాల మూలంగా నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో నష్టనివారణ చర్యలకు పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నాటి సమావేశంలో అసమ్మతి నేతలు ఎలా వ్యవహరిస్తారు అనేది ఆసక్తిగా మారింది.

Revanth Reddy hot comments on party turned Mla's

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N