NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IYR Krishna Rao: పాలన ఈ విధంగా సాగితే అన్ని రంగాలలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిందే…ఏపి సర్కార్ కు మాజీ సీఎస్ ఐవైఆర్ హెచ్చరిక

IYR Krishna Rao: రాష్ట్రంలో కొద్ది రోజులుగా తీవ్ర విద్యుత్ కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గృహ, వ్యవసాయ అవసరాలను ఇబ్బంది తగ్గించడం కోసం ప్రభుత్వం పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెల్ ఫోన్ లైట్ ల వెలుగులోకి ఆసుపత్రుల్లో గర్బిణిలకు వైద్యులు డెలివరీ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఏపి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

IYR Krishna Rao slams jagan govt
IYR Krishna Rao slams jagan govt

IYR Krishna Rao: ఈ సంక్షోభానికి జగన్ ప్రభుత్వానిదే బాధ్యత

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన అంశాలను ప్రస్తావించారు ఐవీఆర్. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతంలో మిగులు విద్యుత్ ఉందనీ, తెలంగాణలో లోటు ఉందని, విభజన జరిగితే తెలంగాణ నష్టపోతుందని పేర్కొన్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా విభజన జరిగిన కొత్తల్లో తెలంగాణ అలాగే విద్యుత్ సమస్యను ఎదుర్కొందన్నారు ఐవైఆర్. ఆనాడు మిగులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఈ రోజు ఎక్కడలేని తీవ్ర విద్యుత్ సమస్య ఎదుర్కొంటోందని పేర్కొన్న ఐవైఆర్.. పాత ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా ఈనాటి విద్యుత్ సంక్షోబానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వీరి పాలన మూడేళ్లుగా సాగుతూనే ఉందని అన్నారు. సరైన ప్రణాళికతో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసి ఉంటే ఈనాడు ఇంత సంక్షోభం ఉండేది కాదని అన్నారు ఐవైఆర్.

పాలన ఈ విధంగా సాగినంత కాలం

“నెత్తిన మోయడానికి అలవి కాని మేనిఫెస్టోను పెట్టుకొని ఇక ఏ ప్రజా అవసరంతో మాకు పని లేదు. సంబంధం లేదు, అప్పులు తెచ్చి పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం, తిరిగి గెలిస్తే అప్పుడు సంక్షేమానికి కోతలు విధిస్తాం అనే విధంగా పాలన సాగినంత కాలం ఒక విద్యుత్ రంగంలోనే కాదు పరిపాలన లోని అన్ని రంగాలలో ఒకదాని తర్వాత ఒకటి తీవ్ర సంక్షోభం ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని ఐవైఆర్ హెచ్చరించారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తూర్పార బట్టిన ఐవైఆర్ కృష్ణారావు గత కొంత కాలంగా జగన్ సర్కార్ లోని తప్పులపైనా విమర్శలు చేస్తున్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!