NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Ministers: మన మంత్రులు ఏం చదివారు.!? ఎవరు ఎక్కడ ఎలా..!?

AP Ministers: రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి అయ్యింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు ఒక్కరొక్కరుగా సచివాలయంలో తమ ఛాంబర్ లలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేవలం రాజకీయాలు చేయడం, తమ నాయకుడిని పొగడటం, ప్రతిపక్షంలోని నాయకులను తిట్టడమే కాదు. రాజ్యాంగ బద్దంగా మంత్రుల బాధ్యతలు చాలా కీలకం. రాష్ట్ర పరిపాలనలో మంత్రులు చాలా కీలమైన భూమికను పోషించాల్సి ఉంటుంది. పరిపాలన అంతా ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రే అన్ని శాఖలను సమీక్షించలేరు, ఆదేశాలు జారీ చేయలేరు, అన్ని శాఖలను చూసుకోలేరు కాబట్టి ఆయా శాఖలకు ఒక మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా శాఖలకు సీనియర్ ఐఏఎస్ లు ప్రిన్సిపల్ సెక్రటరీలు వ్యవహరిస్తుంటారు. ఐఏఎస్ లను సమన్వయం చేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి బాధ్యత మంత్రులకు ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత కమిషనర్, సెక్రటరీలది. రాజ్యాంగ బద్దంగా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న మన  మంత్రుల విద్యార్హతలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

AP Ministers educational qualification details
AP Ministers educational qualification details

 

తానేటి వనిత, హోం శాఖ మంత్రి, విద్యార్హత ఎంఎస్సీ,

అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విద్యార్హత బీఏ చదివినట్లుగా ఆయన నిన్న ఇచ్చిన బయోడేటాలో పేర్కొన్నారు. కానీ ఆయన ఎన్నికల సందర్బంగా ఇచ్చిన అఫిడవిట్ లో 12 తరగతి (ఇంటర్) పాస్ అని ఇచ్చారు. అందులోనే బీఏ డిస్కంటిన్యూ అని పేర్కొన్నారు.

చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమచార పౌరసంబంధాల శాఖ మంత్రి, విద్యార్హత – పీజీ

ఉషాశ్రీ చరణ్ – స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, విద్యార్హత ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్)

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి, విద్యార్హత -ఎంఏ, పిహెచ్‌డీ

గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ మంత్రి , విద్యార్హత – ఎస్‌ఎస్ఎల్‌సీ

బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ, విద్యార్హత బీఏ

సీదిరి అప్పలరాజు – పశు సంవర్థన, మత్స్యశాఖ, విద్యార్హత ఎంబీబీఎస్

కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ మంత్రి, విద్యార్హత ఇంటర్

విడతల రజిని – వైద్య ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం, వైద్య విద్య మంత్రి – విద్యార్హత బీఎస్సీ

రాజన్న దొర – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యార్హత ఎంఏ

దాడిశెట్టి రాజా – రోడ్లు భవనాల శాఖ మంత్రి, విద్యార్హత – బీఏ

జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ మంత్రి, విద్యార్హత – బీఎస్సీ

పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ మంత్రి, విద్యార్హత – బీఎస్సీ బీఇడీ

కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి, విద్యార్హత – బీఇ

ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, విద్యార్హత – ఇంటర్ కానీ రాజకీయ అనుభవం ఉంది, గతంలో ఈ శాఖను నిర్వహించారు.

ఆర్కే రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి, బయోడెటాలో బీఎస్సీ అని పేర్కొన్నారు కానీ అఫిడవిట్ లో ఇంటర్ అని ఇచ్చారు.

ఆదిమూలపు సురేష్ – మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి మంత్రి, విద్యార్హత ఎంఇ, ఎంటెక్, పిహెచ్‌డీ, సివిల్ సర్వెంట్ పని చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు.

బూడి ముత్యాల నాయుడు – పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి మంత్రి, విద్యార్హత ఇంటర్

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్ధిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, విద్యార్హత బీఇ

మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విద్యార్హత – పీజీ

కారుమూరి వెంకట నాగేశ్వరరావు – పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి, విద్యార్హత ఎస్‌ఎస్‌సీ

గుడివాడ అమరనాథ్ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, విద్యార్హత పీజీ

అంబటి రాంబాబు – జలవనరుల శాఖ మంత్రి, విద్యార్హత బీఎల్

కే నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ మంత్రి, బీఎస్సీ

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju