NewsOrbit
న్యూస్

By Polls: ఉప ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్

By Polls: ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఉప ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఒక్క అసెంబ్లీ స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ రెండవ స్థానంలో నిలిచి పరువు కాపాడుకుంది.

BJP Dukout in four state By Polls
BJP Dukout in four state By Polls

By Polls: 2 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం

ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, బీహార్ లలోని ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చిమ బెంగాల్ లోని ఒక అసెంబ్లీ స్థానంతో పాటు ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి యశోదా నీలంబర్ వర్మ 53.55 శాతం ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అదే విధంగా మహారాష్ట్రలోని నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ 53.93 ఓట్ల శాతంతో ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దతుగా ఎన్సీపీ, శివసేన పోటీకి దూరంగా ఉన్నాయి. ఇక బీహార్ లోని బొచహన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్ జేడీ అభ్యర్ధి అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.

 

ఇక పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అసన్ పోల్ లోక్ సభ స్థానం నుండి టీఎంసీ అభ్యర్ధి శత్రుఘన్ సిన్హా విజయం సాధించారు. గతంలో బీజేపీ నేత అయిన సిన్హా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత కొద్ది రోజుల క్రితం టీఎంసీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక బల్లిగంగె అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ నుండి టీఎంసీలో చేరిన సింగర్ బాబూల్ సుప్రియో సీపీఎం అభ్యర్ధి పై 49.22 శాతం ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Related posts

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N