NewsOrbit
న్యూస్

CM YS Jagan Visakha Tour: నేడు విశాఖకు ఏపి సీఎం వైఎస్ జగన్ .. హర్యానా సీఎం మనోహర్ ఖట్టర్ తో భేటీ వెనుక మతలబు ఇదేనా..?

CM YS Jagan Visakha Tour:  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నేడు విశాఖ పర్యటనకు వెళుతున్నారు. అయితే ఈ పర్యటనలో ఓ ప్రత్యేకత ఉండి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో నేచురోపతి చికిత్స తీసుకుంటున్న హరార్యనా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ తో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ వెళుతున్నారు. ఉదయం 11.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ఏపి సీఎం వైఎస్ జగన్ అక్కడ సుమారు గంట పాటు జిల్లా నాయకుల తో సమావేశం అవుతారు. అనంతరం రుషి కొండలోని ఫెమా వెల్ నెస్ సెంటర్ కు వెళ్లి అక్కడ ఉన్న హర్యానా సీఎం ఖట్టర్ తో భేటీ కానున్నారు. ఖట్టర్ తో సమావేశం అనంతరం 1.20 గంటలకు జగన్ తాడేపల్లి కి తిరుగు ప్రయాణం అవుతారు.

CM YS Jagan Visakha Tour
CM YS Jagan Visakha Tour

CM YS Jagan Visakha Tour: మనోహర్ ఖట్టర్ తో భేటీ

అయితే సీఎం జగన్ ప్రత్యేకంగా విశాఖకు వెళ్లి చికిత్సలో ఉన్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎందుకంటే ఖట్టర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన నేత అని అందరికీ తెలుసు. జగన్ ఇప్పుడు ఆయనను ప్రత్యేకంగా కలుస్తున్నారు అంటే రాజకీయంగా ప్రాధాన్యత కల్గి ఉండవచ్చని భావిస్తున్నారు. బీజేపీకి చెందిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రానికి అనేక పర్యాయాలు వచ్చిన సందర్భంలోనూ మర్యాదపూర్వకంగానూ కలవని ఏపి సీఎం జగన్.. రాష్ట్రానికి విచ్చేసిన బీజేపీకి చెందిన మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తుండటం గమనార్హం. త్వరలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న వేళ జగన్-ఖట్టర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju