NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: బహిరంగ ప్రదేశాల్లోనే సామూహిక మానభంగాలు!’వనిత’ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు కరువైన భద్రత!

Andhra Pradesh: మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగాయి. అవి కూడా ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో కాకుండా బహిరంగ ప్రదేశాలలో జరగడం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.వారం రోజుల క్రితం పల్నాడు జిల్లా గురజాల రైల్వేస్టేషన్లో పొరుగు రాష్ర్టానికి చెందిన ఒక వివాహిత సామూహిక మానభంగానికి గురికాగా రెండు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాసుపత్రి లో మతిస్థిమితం లేని దళిత యువతిని ఒక గదిలో నిర్బంధించి ముప్పై గంటల పాటు ఏకధాటిగా ముగ్గురు యువకులు తమ లైంగిక అవసరాలు తీర్చుకున్నారు.

mass rapes in public places thirsty security for women despite woman home minister
mass rapes in public places thirsty security for women despite woman home minister

Andhra Pradesh: గురజాలలో ఏం జరిగిందంటే?

మహారాష్ట్రకు చెందిన ఒక వివాహిత తన రెండేళ్ల కొడుకుతో కలిసి గురజాల రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ వెళ్లడానికి రైలు కోసం వేచి ఉంది.గురజాల రైల్వేస్టేషన్ ఊరికి చాలా దూరంగా ఉంటుంది.జనాల కదలికలు కూడా తక్కువగా ఉంటాయి.ఈ నేపధ్యంలో ఒంటరిగా కనిపించిన వివాహితను దుండగులు బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తల్లి అపస్మారక స్థితిలో పడి ఉండగా కుమారుడు ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వారు బాధితురాలిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కనీసం నలుగురు వ్యక్తులు ఆమెను రేప్ చేశారని వైద్యులు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటున్నప్పటికీ తెలుగు భాష రాని కారణంగా ఆమె చెప్పేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ లు ఏవీ లేవు.

ప్రభుత్వ దవాఖానాలో దారుణం!

గురజాల ఘటన మరుగున పడకముందే బెజవాడలో అంతకు మించిన దారుణం చోటుచేసుకుంది.ఈసారి ఏకంగా ప్రభుత్వ వైద్యశాలే గ్యాంగ్ రేప్ కు ప్రత్యక్ష సాక్షిగా మిగిలింది. ఈ కేసులో నిందితులు ముగ్గురు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు కావటం గమనార్హం. బాధితురాలితో పరిచయమున్న శ్రీకాంత్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి తన వెంట తీసుకొచ్చి ఒక రూములో పెట్టి అత్యాచారం చేశాడు.తదుపరి శ్రీకాంత్ స్నేహితులయిన మరో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఆమెను మానభంగం చేశారు.ఈ రాక్షస క్రీడ ముప్పై గంటలు సాగింది .

తల్లిదండ్రులే కుమార్తె జాడ కనిపెట్టారు!

కాగా కుమార్తె కనిపించకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.అంతేగాక శ్రీకాంత్ మీద అనుమానంతో వారు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వెతుక్కోగా ఒక గదిలో బాధితురాలి మీద ఒక వ్యక్తి అత్యాచారం చేస్తున్న దృశ్యం కంటపడింది.అతడిని రెడ్ హ్యాండెడ్ గా వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.అతడు జరిగినదంతా వివరించాడు సంచలనాత్మకమైన ఘటన కావడంతో పోలీసులు సీరియస్ గా స్పందించి ఆ ముగ్గురు కామపిశాచులను అరెస్టు చేశారు.ఏదేమైనప్పటికీ ఒక ‘వనిత’ హోం మంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అతివలకు రక్షణ కరువైందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?