NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..! రాజకీయ వ్యూహంలో భాగమేనా..?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .రాజకీయంగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ జనసేన ఏపి రాజకీయాల వరకే పరిమితమైన సంగతి తెలిసిందే. గడచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని ప్రకటన చేసినప్పటికీ బీజేపీ పెద్దల అభ్యర్థనలతో చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకున్నారు. అయితే ఇకపై తెలంగాణలో జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తామనీ, ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన తెలంగాణలోని పవన్ అభిమానుల సంతోషాన్ని నింపుతున్నా రాజకీయ వర్గాల్లో కొత్త సందేహాన్ని రేకెత్తిస్తోంది.

Pawan Kalyan key decision on telangana politics
Pawan Kalyan key decision on telangana politics
  • Read the latest news from NEWSORBIT
  •  Follow us on

Pawan Kalyan: ఏపీలో టీడీపీతో పొత్తుకు పవన్ ‘సై’.. ఏపీ బీజేపీ ‘నై’..?

ఇప్పటికే జనసేన పార్టీ ఏపిలో బీజేపీతో ప్రయాణం చేస్తొంది. ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటన చేయడం ద్వారా టీడీపీతో కలిసి ఎన్నికల్లో ప్రయాణం చేయనున్నామన్న హింట్ ఇచ్చారు. టీడీపీతో పొత్తుకు జనసేన సై అంటుంటే ఏపి బీజేపీ నేత సోము వీర్రాజు నై నై అంటున్నారు. జనసేనతోనే బీజేపీ పొత్తు, టీడీపీతో మాకు కలవదు అని సోము సారు పదే పదే చెప్పేస్తున్నారు. ఈ అంశంలో అవసరమైతే కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడతానంటున్నారు పవన్ కళ్యాణ్. ఏపిలో బీజేపీ – జనసేన పొత్తు అనే మాటే గానీ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఉమ్మడి ప్రణాళికతో వైసీపీ  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ముందుకు సాగుతామని గతంలో ఓ సారి ప్రకటన అయితే ఇచ్చారు గానీ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం లేదు.

Pawan Kalyan: తెలంగాణాలోనూ జనసేన పోటీ

ఇప్పుడు తాజాగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుని అమలు చేస్తొంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార టీఎస్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను, పార్టీ బలోపేతంకై తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు.

 

Pawan Kalyan: వ్యూహంలో భాగమేనా..?

కాంగ్రెస్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మద్య త్రిముఖ పోటీ ఉండగా షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీలకు తోడు జనసేన కూడా పోటీ రంగంలో నిలిస్తే బహుముఖ పోటీ అవుతుంది. బహుముఖ పోటీ జరిగితే అది అధికార పార్టీకే అడ్వంటేజ్ గా మారుతుందని అందరికీ తెలుసు. అయితే బీజేపీతో కటీఫ్ చెప్పేందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెడుతున్నారా..? లేక ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ తన మాట వినేందుకు రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రకటన చేశారా..? అనేది తేలాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయని పేర్కొన్నారు. సో..ఇది కూడా రాజకీయ వ్యూహాల్లో ఓ భాగమేనా అనేది మరి కొద్ది రోజుల్లో తేలుతుంది.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju