Prabhas: `బాహుబలి` మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీయన చేతిలో ఉన్న చిత్రాల్లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ కిరాగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. గత ఏడాదే కొంత షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మళ్లీ ఇటీవలె సెకెండ్ షెడ్యూల్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ మూవీ కోసం ప్రభాస్ బరువు తగ్గబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బయటకు వచ్చిన ప్రభాస్ లేటెస్ట్ పిక్‌ను చూస్తే ఆ ప్రచారమే నిజమని అనిపిస్తోంది. ఈ ఫోటో లో ప్రభాస్ ఫిట్ గా, స్లిమ్ గా మరియు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
ప్రభాస్ బరువు తగ్గాడని ఈ ఫొటోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఆయన తాజా పిక్ చూసి ఫిదా అయిపోతున్నారు. కాగా, సాహో, రాధే శ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ చాలా బొద్దుగా కనిపించారు. ఆయన ముఖంలో కళ తప్పినట్టు కూడా కనిపించింది. దీంతో ఆయన లుక్స్‌పై కొందరు నెటిజన్లు సెటైర్లు పేల్చారు. అయితే వాటన్నిటికీ ఒక్క ఫొటోతో బదులిచ్చాడు ప్రభాస్.