NewsOrbit
జాతీయం న్యూస్

Yoga Day: ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు .. మైసూర్ లో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ

Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 75 నగరాలలో నేడు యోగా వేడుకలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని మైసూర్ లో యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ఫర్ హ్యూమానిటీ అన్న నినాదంతో  ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, అథ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందని అన్నారు మోడీ.

PM Modi performs Yoga in Mysuru
PM Modi performs Yoga in Mysuru

Yoga Day: యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలి

యోగ అత్మ విశ్వాసం కల్పిస్తుందని, జీవన విశ్వాసం ఇస్తుందని పేర్కొన్నారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదనీ, అందరిదని అన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. భారత ప్రత్యేకతను, వైవిద్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో యోగా శాంతి నెలకొల్పుతుందనీ, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందని, యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 15 వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కాగా దేశ వ్యాప్తంగా జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొన్నారు.

 

ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఉత్తరప్రదేశ్ నోయిడాలో, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రుషికేష్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రత సాధించడం అని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. యోగా భారతీయ సంస్కృతికి ప్రతికీ అని, కులమతాలకు అతీతమైనదని అన్నారు.

 

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju