NewsOrbit
రాజ‌కీయాలు

‘పధకం ప్రకారమే దాడి’

గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం చూడలేదని కోడెల అన్నారు. ఇనుమిట్లలో బూత్ ఆక్రమణ జరిగిందని తెలిసి అక్కడికి వెళ్లానని కోడెల చెప్పారు. వైసిపి నేతల తీరు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్లుంద్దని కోడెల అన్నారు. దాడి చేసిన వారే తిరిగి ఫిర్యాదు చేస్తారా అని కోడెల ప్రశ్నించారు.

మొన్నటి దాడిలో కావాలనే వెనక్కి తగ్గమని కోడెల అన్నారు. ఘర్షణ పడవద్దని టిడిపి కార్యకర్తలకు చెప్పానన్నారు. స్పీకర్ పై దాడి జరిగితే సుమోటోగా కేసు చేపడతారని కోడెల తెలిపారు.

కొందరు నేతలు మరో గతి లేక జగన్ పక్కన ఉన్నారని కోడెల అన్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేస్తారన్న కోడెల విచారణలో నిజా నిజాలు వెల్లడవుతాయన్నారు. దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కోడెల పేర్కొన్నారు. ఇనుమెట్లలో ఏం జరిగిందో వీడియో దృశ్యాలు బయటపెట్టాలని కోడెల డిమాండ్ చేశారు.

టిడిపికి వైసిపి పోటీ కాదు.. కోడెలకి అంబటి పోటీ కాదు..అని కోడెల అన్నారు. వైసిపి నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని కోడెల విమర్శించారు. అసెంబ్లీకి రానివాళ్లు జీతాలు ఎలా తీసుకుంటారని కోడెల ప్రశ్నించారు. జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని కోడెల ఘాటుగా విమర్శించారు. ప్రవర్తన మార్చుకోక పోతే రాజకీయ నాయకుడిగానూ పనికిరాడని కోడెల పేర్కొన్నారు.

జగన్ ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారు, కేసీఆర్ తో కలిసి పని చేస్తానంటారు. ఇలాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరని కోడెల అన్నారు. ఆంధ్ర ప్రజలు చైతన్యం, విజ్ఞత కలిగిన వాళ్ళనీ, వాళ్ళకి ఏం కావాలో స్పష్టంగా తెలుసనీ కోడెల చెప్పుకొచ్చారు.

మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని కోడెల అన్నారు. మహిళలు, పింఛన్ల లబ్ధిదారులు టిడిపి వెంటే ఉన్నారని కోడెల పేర్కొన్నారు. సభాపతిగా నిస్పక్షపాతంగా పని చేసానని కోడెల అన్నారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Leave a Comment