టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కిన `కార్తికేయ` చిత్రం 2014లో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా `కార్తికేయ 2`ను రూపొందించారు. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.
అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, కేఎస్ శ్రీధర్, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం.. ఆగస్టు 13న విడుదలై తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ద్వాపర యుగం .. ద్వారకా నగరం అనే ఒక ఆసక్తికరమైన పాయింట్ తో కూడిన కథాకథనాలను ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. టాక్ బాగుండటంతో తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్‌ను వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరింత జ్యోష్తో మాస్ జాతర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3.50 కోట్ల రేంజ్లో షేర్‌ను వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు తొలి రోజు కంటే ఎక్కువగా రూ. 3.81 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా `కార్తికేయ 2` 2 డేస్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 2.60 కోట్లు
సీడెడ్: 1.09 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.95 కోట్లు
తూర్పు: 0.62 కోట్లు
పశ్చిమ: 0.45 కోట్లు
గుంటూరు: 0.75 కోట్లు
కృష్ణ: 0.57 కోట్లు
నెల్లూరు: 0.28 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ= 7.31 కోట్లు(11.15కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటఖ+రెస్టాఫ్ ఇండియా: 0.45 కోట్లు
ఓవర్సీస్: 2.15 కోట్లు
నార్త్ ఇండియా: 0.16 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 10.07 కోట్లు(17.00 కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 12.80 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మూవీని క్లీన్ హిట్‌గా నిలవాలంటే తొలి రెండు రోజుల వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 3.23 కోట్ల షేర్‌ను రాబడితే సరిపోతుంది.