టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయింది. అయితే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు.
అయితే విజయ్ కు ఉన్న క్రేజ్, మేకర్స్ భారీ ఎత్తున చేసిన ప్రమోషన్స్ వల్ల ఈ మూవీ తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. కానీ, నెగటివ్ టాక్ స్పెడ్ అవ్వడంతో 2వ రోజు లైగర్ బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 9.57 కోట్ల రేంజ్లో షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండవ రోజు కేవలం రూ. 1.54 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా లైగర్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 5.00 కోట్లు
సీడెడ్: 1.52 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.47 కోట్లు
తూర్పు: 0.76 కోట్లు
పశ్చిమ: 0.48 కోట్లు
గుంటూరు: 0.87 కోట్లు
కృష్ణ: 0.55 కోట్లు
నెల్లూరు: 0. 46 కోట్లు
——————————–
ఏపీ+తెలంగాణ= 11.11కోట్లు(18.35కోట్లు~ గ్రాస్)
——————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.75 కోట్లు
ఇతర భాషలు: 0. 35 కోట్లు
హిందీ: 2.50 కోట్లు
ఓవర్సీ: 2.80 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ – 17.51కోట్లు(33.50కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో రూ. 17.51 కోట్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఇంకా రూ. 72.49 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి డిజాస్టర్ టాక్ తో విజయ్ అంత పెద్ద భారీ టార్గెట్ ను అందుకుంటాడో..లేదో..చూడాలి.