తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నుంచి వచ్చిన తాజా చిత్రమే `కోబ్రా`. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఇందలో `కేజీఎఫ్`తో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది.
ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు కీలక పాత్రలను పోషించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆగస్టు 31 తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. `కోబ్రా` కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్‌లో అద్భుతంగా అలరించారు.
నటుడిగా మరోసారి వైవిధ్యం చూపించారు. కానీ.. సినిమా నడివి, రొటీన్ క్లైమాక్స్ పెద్ద మైనస్లుగా మారాయి. అయితే టాక్ ఎలా ఉన్నా.. విక్రమ్ కు ఉన్న క్రేజ్, మేకర్స్ చేసిన ప్రమోషన్స్ తో ఈ మూవీ తొలి రోజు అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 2.28 కోట్ల షేర్‌ను వసూల్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ. 12.60 షేర్‌ను రాబట్టింది. తెలుగులో కోబ్రా ఏరియాల వారీగా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నిజాం: 0.66 కోట్లు
సీడెడ్: 0.28 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.40 కోట్లు
తూర్పు: 0.23 కోట్లు
పశ్చిమ: 0.14 కోట్లు
గుంటూరు: 0.21 కోట్లు
కృష్ణ: 0.24 కోట్లు
నెల్లూరు: 0. 12 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ = 2.28 కోట్లు (3.75కోట్లు~గ్రాస్)
———————————
ఇక వరల్డ్ వైడ్‌గా `కోబ్రా` గ్రాస్ వసూళ్లను గమనిస్తే..
తమిళనాడు: 12.10 కోట్లు
తెలుగు రాష్ట్రాలు: 3.75 కోట్లు
కర్ణాటక: 2.15 కోట్లు
కేరళ: 1.65 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 0.90 కోట్లు
ఓవర్సీస్: 3.90 కోట్లు
——————————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్ = 24.45కోట్లు గ్రాస్ (12.60కోట్లు~ షేర్)
——————————————
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఇంకా రూ. 2.72 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ వర్త్ బిజినెస్ రూ. 60 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఇక ముందు ముందు ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.