మాస్ మహారాజ్ రవితేజకు ఏజ్ సెగ తగిలింది. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటంటూ నెటిజన్లు ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి రవితేజ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `ధమాకా` ఒకటి. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ఇదిలా ఉంటే.. నిన్న వినాయక చవితి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సినీ ప్రియులను ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఓ వర్గం వారు మాత్రం ఈ వీడియోను చూసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
రవితేజకు, శ్రీలీలకు మధ్య భారీ ఏజ్ గ్యాప్ ఉండటమే అందుకు కారణం. రవితేజ వయస్సు 54 కాగా.. శ్రీలీలకు కేవలం 21 ఏళ్లే. అంటే రవితేజ ఏజ్‌లో శ్రీలీల ఏజ్ సగం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే కూతురు వయసున్న హీరోయిన్ శ్రీలీలతో రవితేజ రొమాన్స్ చేయడం ఎబ్బెట్టుగా ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.